Friday, December 20, 2024

నేపాల్ లో మళ్లీ భూప్రకంపనలు

- Advertisement -
- Advertisement -

నేపాల్ ప్రజలు మరోసారి భూకంపం భయంతో వణికిపోయారు. రెండు రోజుల కిందట నేపాల్ లో భూకంపం బారినపడి 150మందికి పైగా మరణించారు. మరోసారి భూకంపం రావడంతో జనం అల్లాడిపోయారు. వెంటనే ఇళ్లలోంచి రోడ్లమీదకు పరుగులు తీశారు. తాజాగా సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 5.6గా నమోదైంది. ఢిల్లీలోనూ కొన్నిచోట్ల భూమి కంపించింది. ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యకు 230 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ పేర్కొంది. నేపాల్ లో శుక్రవారం రాత్రి వచ్చిన భూకంపానిక 157మంది బలికాగా, భారీయెత్తున ఇళ్లు నేలమట్టమయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News