Sunday, January 19, 2025

వైద్యం కోసం వచ్చి రాజకీయ కార్యకలాపాలా?

- Advertisement -
- Advertisement -

చంద్రబాబుపై వైసిపి విమర్శ

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబుపై వైసిపి తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. రాజకీయ కార్యకలాపాలను చక్కబెట్టే పనిలో చంద్రబాబు బిజీగా ఉన్నారంటూ వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌లు విమర్శించారు. వైద్యం కోసం మధ్యంతర బెయిల్ తీసుకుని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు… ఇదే పనిలో ఉన్నారని దుయ్యబట్టారు. జైల్లో చంద్రబాబు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ టిడిపి అండ్ కో పెద్ద కలరింగ్ ఇచ్చిందని తెలిపారు.

రాజమండ్రి నుంచి ఉండవల్లిలోని నివాసానికి 14 గంటలు కారులో ప్రయాణించిన బాబు… హైదరాబాద్ లో జనసేనాని పవన్ కల్యాణ్ తో దాదాపు 2 నుంచి 3 గంటల సేపు రాజకీయ చర్చలు జరిపారని వైసిపి నేతలు విమర్శించారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ఇవన్నీ చేయగలరా? అని ప్రశ్నించారు. ఈ మేరకు వారు చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు బెయిల్ తీసుకుంది వైద్యం కోసమా? లేక రాజకీయాలు చేసేందుకా? అని వైసిపి నేతలు ప్రశ్నించారు. బెయిల్ కోసం అని చెప్పి జైలు నుండి బయటికి వచ్చారని.. ఆరోగ్య సమస్యలు ఇప్పుడు నయమైపోయాయా? అని ఎద్దేవా చేశారు. వైద్యం కోసమే అయితే జైలు నుంచి విడుదలైన రోజున రాజకీయ ర్యాలీలు ఎందుకని తీశారని వారు ప్రశ్నించారు. హైదరాబాద్‌లో రాజకీయ మంతనాల కోసమే బెయిల్ తీసుకున్నారా? అని విజయసాయి రెడ్డి మండిపడ్డారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News