Sunday, January 19, 2025

కరీంనగర్ చరిత్రనే తిరగరాసే టైమొచ్చింది:బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

కరీంనగర్ : ధర్మరక్షణ కోసం చివరి శ్వాస దాకా పోరాడుతూనే ఉంటానని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కు మార్ ఉద్ఘాటించారు. ప్రతి ఇంటికి రక్షకుడిగా ఉంటానన్నారు. ప్రతి ఒక్కరూ ఛత్రపతి శివాజీలా, ఝాన్సీ లక్ష్మీబాయిలా బ యటకు వచ్చి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. సోమవారం కరీంనగర్‌లోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద నిర్వహించి న బై క్ ర్యాలీలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.మనోహర్ రెడ్డి, ధర్మపురి అసెంబ్లీ అభ్యర్ధి ఎస్. కుమార్, చీకోటి ప్రవీణ్ కుమార్ తదతరులతో కలిసి బండి సంజయ్ బైక్ ర్యాలీ నిర్వహించి నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముండు బండి సంజయ్ మాట్లాడుతూ కరీంనగర్ మొత్తం కాషాయమైందని, ఇంతమంది ఎందుకొచ్చా రు? ధర్మం కోసమా? కాదా? కరీంనగర్ లో కాషాయ జెండా ఎగరేద్దాం.. ధర్మాన్ని నిలబెడదాం అన్నారు.

మా చేతిలో ఉండేది కాషాయ జెండానే, మీరిచ్చిన కాషాయ జెండాను కొందరు మర్చిపోయారు, ఎంపీగా నా చేతికి కాషాయ జెండా అందిం చింది మీరే..1.2 లక్షల ఓట్లేశారు, ఏనాడూ నేను వదిలిపెట్టలేదు, కాషాయ జెండాను రెపరెపలాడించాను, ధర్మ రక్షణ కోసం పనిచేసిన అని గుర్తు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో కేసీఆర్ నియంత పాలనకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా తిరిగిన అన్నారు. హిందూ ఓట్ బ్యాంకును ఏకం చేసిన, ఆ తరువాత అన్ని ఎన్నికల్లో బీజేపీకి విజయపరంపర కొనసాగించినం అన్నారు. చాలా పార్టీలు హిందూ సమాజాన్ని చులకన చేశాయని గుర్తు చేశారు. నాపై 30కి పైగా కేసులు పెట్టినా లెక్క చేయలేదని అన్నారు. పాతబస్తీలో సభ పెట్టి పాతబస్తీని అభివృద్ధి చేస్తామంటే… ముస్లిం మేధావుల్లో మార్పు వచ్చింది… రబ్బర్ చెప్పులు… జీన్స్ ప్యాంట్ వేసిన యువకులే కరీంనగర్ చరిత్రను మార్చబోతున్నారని జోష్యం చెప్పారు. ఎంపీగా గెలిపిస్తే ఏం చేశానని కొందరు నాపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. మూడేళ్లలో కేంద్రం నుంచి ఎన్నో నిధులు తెచ్చి అభివృద్ధి చేశానన్నారు. మీరిచ్చే తీర్పు కరీంనగర్ చరిత్రను తిరగరాయబోతోందని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News