Thursday, December 19, 2024

మంగళవారం రాశి ఫలాలు(07-11-2023)

- Advertisement -
- Advertisement -

మేషం – పార్ట్‌టైం జాబ్‌వర్క్‌లను నంపాదించుకోగలుగుతారు. ఆశించిన బుణాలను అందుకో గలుగుతారు. స్వార్ధ ప్రపంచాన్ని చూసి నివ్వెరపోతారు. ప్రతివిషయాన్ని స్పూర్తిగా తీసుకుంటారు.

వృషభం – జీవితభాగస్వామితో కీలక విషయాలపై చర్చలు సాగిస్తారు. రాజకీయరంగంలోని వారికి అనుకూలం. కొనుగోళ్లను సాగిస్తారు. సెంటిమెంట్‌ వస్తువుల భద్రతావిషయమై జాగ్రత్తలు పాటించండి. గోశాలలో గరిక దానం చేయండి.

మిథునం –  క్రీడాకారులు మంచి ఫలితాలను సాధించగలుగుతారు. దీక్షా కార్యక్రమాలు చేపడతారు. వ్యాపార పరంగా మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. మిత్రుల సలహాలు, సూచనలను పాటిస్తారు.

కర్కాటకం – మీ అభిప్రాయాలతో పెద్దలు కూడా ఏకీభవిస్తారు. అవకాశాలు కలిసి వస్తాయి. సంతాన విషయమై శ్రద్ధను కనబరుస్తారు. కళాసాహిత్యరంగాల పట్ల మీకున్న మక్కువ మరింతగా పెరుగుతుంది,

సింహం – సొంత నిర్ణయాలను తీసుకుంటారు. దారి, తెన్నూలేని వ్యవహారాలను ఒక గాడిలో పెట్టడానికి గాను మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సెంటిమెంట్‌ విషయాలు కలిసి వస్తాయి. వాహన యోగ నూచన.

కన్య – వినోదకార్యక్రమాలకు, విలాసాలకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. పెరుగుతున్న  నిత్యావసర ధరలు, ఖర్చులు ఆలోచింప చేస్తాయి. ఆరోగ్యానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. దైవదర్శనం చేసుకుంటారు.

తుల – మానసిక ఒత్తిడికి దూరంగా ఉండగలుగుతారు. నూతన రంగంలోని వారితోటి పరిచయాలు ఏర్పడతాయి. ఉత్తర ప్రత్యుత్తరాలను సాగిస్తారు. బంధువుల రాక ఆనందానికి కారణమవుతుంది.

వృశ్చికం – సలహాలు, నూచనలు ఇచ్చేవారు అధికంగా ఉంటారు. నిష్కారణంగా నిందారోపణలకు గురి చేస్తున్న వారిని గుర్తిస్తారు. ప్రచారంలో ఉన్న పుకార్లు నిజమని నమ్ముతారు. శుభవార్తలు వింటారు.

ధనుస్సు – విశాల హృదయంతో వ్యవహరిస్తారు. అందరి పట్ల సమన్యాయాన్ని కనబరుస్తారు. మంచి వ్యక్తిగా గుర్తింపును పొందుతారు. శుభకార్య యత్నాలు కలిసి వస్తాయి. వాహన మరమత్తులు చేస్తారు.

మకరం – గృహాలంకరణలకు ప్రాముఖ్యతనిస్తారు. ఉపయుక్తమైన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఆరోగ్యం నలతగా ఉంటుంది. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.ఆర్ధికంగా స్వల్పలాభాలుంటాయి.

కుంభం – శ్రేయోభిలాషులతో కలిసి చర్చలను సాగిస్తారు. ఆహార నియమాలను పాటించడం మంచిదని చెప్పదగిన సూచన. ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థికస్థితి మెరుగ్గా ఉంటుంది. ప్రజా సంబంధాలను మరింతగా వృద్ధి చేసుకుంటారు.

మీనం – అనాలోచిత నిర్ణయాలను తీసుకుంటారు. తొందరపాటు, దుడుకుతనం కలిగి ఉంటారు. చెల్లింపుల విషయమై ఎక్కువగా ఆలోచిస్తారు. ఉత్తమమని భావించిన వ్యవహారాలలో ఇతరులకు జోక్యం కల్పించకండి.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News