Tuesday, April 1, 2025

ఆయుధ పూజ… రాజాసింగ్‌కు షోకాజ్ నోటీసులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిజెపి ఎంఎల్‌ఎ రాజాసింగ్‌కు పోలీసులు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. కత్తులను బహిరంగంగా ప్రదర్శించారని నోటీసులు జారీ చేశారు. దసరా రోజు తుపాకులు, కత్తులతో రాజాసింగ్ పూజలు చేశారు. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని మంగళ్‌హాట్ పోలీసులు తెలిపారు. దసరా రోజు రాజాసింగ్ ఆయుధ పూజ సందర్భం కత్తులు, తుపాలకు పూజ చేసిన చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంఎ సమద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఐపిసి 153ఎ, 295ఎ, 504 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News