Friday, December 20, 2024

సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలో 2027 వరల్డ్ కప్ క్రికెట్ టోర్నీ

- Advertisement -
- Advertisement -

మరో రెండు వారాల్లో ప్రస్తుత వరల్డ్ కప్ టోర్నీ ముగుస్తుందనగా, 2027లో జరిగే వరల్డ్ కప్ వివరాలను ఐసిసీ వెల్లడించింది. ఈ టోర్నమెంటుకు సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు ఉమ్మడిగా ఆతిథ్యమివ్వనున్నాయి. మొత్తం 14 జట్లు పాల్గొంటాయి. గ్రూప్ -ఏ లో ఏడు జట్లు, గ్రూప్ -బి లో ఏడు జట్లు లీగ్ మ్యాచ్ లు ఆడతాయి. రెండు గ్రూపులలో అగ్రస్థానంలో నిలిచిన మూడు జట్లు సూపర్ -6కు అర్హత సాధిస్తాయి. సూపర్ -6లో ఒక్కొక్క జట్టు మిగిలిన జట్లతో ఐదు మ్యాచ్ లు ఆడుతుంది. టాప్ -4లో నిలిచిన జట్లు సెమీఫైనల్ కు అర్హత సాధిస్తాయి. అందులో గెలిచిన రెండు జట్లు ఫైనల్ కు చేరుకుంటాయి.

ప్రపంచ కప్ కు ఆతిథ్యమిస్తున్న సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా జట్లు నేరుగా ప్రపంచ కప్ కు అర్హత సాధించినట్లే లెక్క. ఐసీసీ ర్యాంకింగ్స్ లో మొదటి ఎనిమిది స్థానాల్లో నిలిచిన జట్లు కూడా ఈ టోర్నమెంటుకు అర్హత సాధిస్తాయి. మిగతా స్థానాలకోసం మిగిలిన జట్లు క్వాలిఫై మ్యాచ్ లు ఆడాల్సి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News