- Advertisement -
గజ్వేల్: బిజెపి ఎంఎల్‌ఎ ఈటల రాజేందర్ గజ్వేల్‌కు రావడంతో సిఎం కెసిఆర్‌కు నిద్ర పట్టడంలేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈటల రాజేందర్ గజ్వేల్ నామినేషన్ వేసిన సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గజ్వేల్‌లో గెలుస్తాననే నమ్మకం కెసిఆర్‌కు లేదని, గజ్వేల్‌లో ఓటమి భయంతో కెసిఆర్ కామారెడ్డిలోనూ పోటీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కెసిఆర్ కుటుంబం చేతిలో తెలంగాణ బందీగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను కెసిఆర్ తన బానిసలుగా మార్చుకున్నారని దుయ్యబట్టారు.
- Advertisement -