ఈ వరల్డ్ కప్ లో సంచలన విజయాలతో ఆకట్టుకున్న ఆఫ్ఘానిస్థాన్ జట్టు మంగళవారం మరో బిగ్ ఫైట్ కు సిద్ధమైంది. ముంబయిలోని వంఖడే స్టేడియం వేదికగా బలమైన ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆఫ్ఘాన్ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా గెలిస్తే సెమీఫైనల్ కు చేరుకుంటుంది. ఒకవేళ, ఈ మ్యాచ్ లో ఓడిపోతే ఆఫ్ఘానిస్థాన్ సెమీస్ ఆశలు గల్లంతైనట్లే.దీంతో ఈ మ్యాచ్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
ఆఫ్ఘనిస్తాన్: హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, ఇక్రమ్ అలీఖిల్, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నూర్ అహ్మద్, నవీన్-ఉల్-హక్.
ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్(కెప్టెన్), ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, మార్నస్ లాబుషాగ్నే, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్.