Monday, November 25, 2024

కాంగ్రెస్ కు డిపాజిట్ కూడా రావొద్దు: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

రైతులను మోసం చేసేందుకు మరోసారి కాంగ్రెస్ నాయకులు వస్తున్నారని కెసిఆర్ మండిపడ్డారు. మందమర్రిలో బీఆర్ఎస్ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. “ఎన్నికల వేళ ప్రజలు విచక్షణతో ఓటు వేయాలి. ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం. డబ్బుకు ఓటు అమ్ముకోవద్దు. మనం వేసే ఓటే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది.ఉన్న తెలంగాణను ఆంధ్రాలో కలిసింది కాంగ్రెస్ పార్టే. తెలంగాణ రాకముందు వరకు భయంకర పరిస్థితులు ఉండేవి.

సింగరేణిలో 49శాతం వాటాను కేంద్రానికి కట్టబెట్టింది కాంగ్రెస్సే. వారి పాలనలో నష్టాల్లోకి వెళ్లిన సింగరేణి.. ప్రస్తుతం రూ.2.184కోట్ల లాభాల్లోకి తీసుకొచ్చాం. రైతు బంధు వద్దు.. ధరణి పోర్టల్ వద్దు, కరెంటు వద్దు అంటూ కాంగ్రెస్ నాయకులు బహిరంగంగానే చెబుతున్నారు. వీటన్నింటినీ తీసేసి మళ్లీ దళారుల, పైరవీకారుల రాజ్యాన్ని తీసుకురావాలని చూస్తున్న కాంగ్రెస్ కు డిపాజిట్ కూడా రావొద్దు. ఇక, నరేంద్ర మోడీకి ప్రైవేటీకరణ పిచ్చి పట్టింది. సింగరేణిని ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం ప్రయత్నిస్తోంది.

బాల్క సుమన్ రాక ముందు.. వచ్చిన తర్వాత చెన్నూరు ఎలా ఉందో ఆలోచించాలి. చెన్నూరులో సుమన్ చాలా అభివృద్ధి పనులు చేశారు. ఎక్కువ సమయం సుమన్ నా దగ్గరే ఉంటూ పార్టీ కోసం పనిచేస్తుంటడు. సిఎం దగ్గర ఉండే సుమన్ ను గెలిపించుకుంటే వేగంగా పనులు జరుగుతాయి.. కాబట్టి సుమన్ ను 50వేల మెజారిటీతో గెలిపించాలి” అని కేసీఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News