Sunday, January 19, 2025

కాంగ్రెస్, బిఆర్ఎస్, ఎంఐఎంల డిఎన్ఎ ఒక్కటే: మోడీ

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్, బిఆర్ఎస్, ఎంఐఎంల డిఎన్ఎ ఒక్కటేనని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. నగరంలోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బిజెపి బిసి ఆత్మగౌరవ సభలో మోడీ పాల్గొని… నా కుటుంబ సభ్యులారా అంటూ తెలుగులో ప్రసంగించారు. “బిజెపి..దళితులకు, ఆదివాసులకు ప్రధాన్యతనిస్తుంది. పేదలకు ఫ్రీగా రేషన్ ఇస్తున్నాం. జనం సంపదను లూటీ చేసిన వారి సంగతి తేలుస్తాం. మూడు పార్టీలు కుటుంబ పాలన కోరుకుంటున్నాయి. కెసిఆర్ సర్కార్ ను ఓడించాలా.. వద్దా?. బిఆర్ఎస్.. బిసిని ఎందుకు సిఎం చేయదు. కాంగ్రెస్, బిఆర్ఎస్ లు ఓబిసిల గురించి ఆలోచించవు.

అహంకార సిఎంకు ఓబిసిలు ఓటుతో బుద్ది చెప్పాలి. కెసిఆర్ సర్కార్ చేతగాని తన వల్ల వ్యవస్థను నాశనం చేసింది. బిఆర్ఎస్ తెలంగాణను లూటీ చేసింది. కాంగ్రెస్, బిఆర్ఎస్, ఎంఐఎంల డిఎన్ఎ ఒక్కటే. కాంగ్రెస్ కు బిఆర్ఎస్ సి-టీమ్. కాంగ్రెస్, బిఆర్ఎస్ లు.. ఎస్సీ, ఎస్టీ, బిసిలకు విరోధి. ప్రత్యేక రాష్ట్రం కోసం ఎందరో అమరులయ్యారు. తెలంగాణ వచ్చాక బిసిలను మోసం చేశారు.

బిసిల ఆకాంక్షలను పట్టించుకునేది బిజెపి మాత్రమే. బిసిలకు ఎక్కువ టికెట్లు ఇచ్చింది బిజెపి. అబ్దుల్ కలామ్ ను వాజ్ పేయూ రాష్ట్రపతిని చేశారు. పిఎ సంగ్మా, బాలయోగిని స్పీకర్ చేసింది బిజెపినే. రామ్ నాథ్ కోవింద్ ను రాష్ట్రపతిని చేసింది బిజెపినే. గిరిజన మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతిని చేసింది బిజెపినే అని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News