Saturday, December 21, 2024

జనసేన పార్టీ అభ్యర్థుల ఖరారు

- Advertisement -
- Advertisement -

ఎన్నికల్లో ఎనిమిది చోట్ల నుంచి పోటీ

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ మంగళవారం నాడు అభ్యర్దులను ఖరారు చేశారు. రాష్ట్రంలో మొత్తం ఎనిమిది నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. అందులో కూకట్‌పల్లి నుంచి ముమ్మారెడ్డి ప్రేమ్‌ కుమార్ , తాండూరు నుంచి నేమూరి శంకర్‌గౌడ్, కోదాడ నుంచి మేకల సతీష్ రెడ్డి, నాగర్‌కర్నూల్ నుంచి వంగ లక్ష్మణ్‌గౌండ్ , ఖమ్మం నుంచి మిర్యాల రామకృష్ణ, కొత్తగూడెం నుంచి లక్కినేని సురేందర్‌రావు, వైరా(ఎస్టీ)నుంచి డా.తేజావత్ సంపత్ నాయక్, అశ్వారావుపేట(ఎస్టీ) నుంచి ముయబోయిన ఉమాదేవిలను ఎంపిక చేసినట్టు తెలిపారు. ఎనిమిది నియోజకవర్గాల నుంచి పోటీ చేయబోతున్న జనసేన అభ్యర్ధులకు ఆ పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ అభినందనలు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News