- Advertisement -
రాజస్థాన్: కేంద్రమంత్రి అమిత్ షాకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రచార వాహనం దిడ్వానా రోడ్ షోలో విద్యుత్ వైర్లను తాకింది. దీంతో బిజెపి నేతలు అమిత్ షా రోడ్ షోను రద్దు చేశారు. మంగళవారం దివానా కుచమన్ జిల్లాలోని నవాన్, మక్రానా, పర్బత్‌సర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల సభలో ప్రసంగించేందుకు హోంమంత్రి వెళ్లారు.
మధ్యాహ్నం కూచమన్‌లో జరిగిన సభలో ప్రసంగించిన అనంతరం మక్రానాకు వెళ్లి మక్రానాలో ప్రసంగించిన అనంతరం రథం ఎక్కి పర్బత్‌సర్‌కు చేరుకున్నారు. పర్బత్‌సర్ నగరంలోని సాంద్ చౌక్ సమీపంలో రథం వెళుతుండగా, ఎల్‌టి విద్యుత్ లైన్ వైర్ రథాన్ని తాకడంతో నిప్పురవ్వలు ఎగిరి తీగ తెగి కిందపడింది. రథం ముందుకెళ్లినా వెనకాలే సెక్యూరిటీ సిబ్బంది జీపు ఆగింది. ఆ తర్వాత రథాన్ని కూడా నిలిపివేశారని అధికారులు తెలిపారు.
- Advertisement -