- Advertisement -
పంజాబ్ లో భూకంపం సంభవించింది. రూప్‌నగర్ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున 1.13 గంటల సమయంలో భూ ప్రకంపనలు సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకటించింది. రిక్టర్ స్కేలుపై 3.2గా భూకంప తీవ్రత నమోదైనట్లు వెల్లడించింది. రూప్‌నగర్ లో భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
కాగా, ఇటీవల నేపాల్ లో భారీ భూకంపం సంభవించి వందల మంది మరణించిన విషయం తెలిసిందే. నేపాల్ భూకంప ప్రభావంతో భారత్ లోని ఢిల్లీ, యూపి, బిహార్ లలో కూడా భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
- Advertisement -