Friday, December 20, 2024

గాజాలో రోజుకు సగటున 160 మంది చిన్నారుల మృతి

- Advertisement -
- Advertisement -

ఇజ్రాయెల్ దాడులతో అతలాకుతలమవుతున్న గాజాలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. తినడానికి తిండి లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. అక్కడ రోజుకు సగటున 160మంది చిన్నారులు చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. గాజాలో యుద్ధం మొదలై నెలరోజులైంది. అక్టోబర్ 7న ప్రారంభమైన యుద్ధంలో ఇంతవరకూ పదివేలమందికి పైగా చనిపోయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అంతేకాకుంఢా, క్షతగాత్రులను ఆదుకునేందుకు గాజా ప్రాంతంలో పనిచేస్తున్న హెల్త్ వర్కర్లలో 16మంది కూడా బాంబు దాడులకు బలైపోయారట.

ఆసుపత్రులు, సంబంధిత సంస్థలపై 102కి పైగా దాడులు జరిగాయట. ప్రస్తుతం గాజాలో 14 ఆస్పత్రులు బాంబు దాడుల్లో ధ్వంసం కావడంవల్లనో లేక వనరుల లేమి కారణంగానో పనిచేయడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి క్రిస్టియన్ లిండ్ మీయర్ తెలిపారు. నీళ్లు, ఇంధనం, ఆహారం దొరక్క ప్రజలు అల్లాడుతున్నారని, వైద్య సేవలు మృగ్యమైపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు డాక్టర్లు రోగులకు అనస్తీషియా ఇవ్వకుండానే శస్త్రచికిత్సలు చేయవలసిన పరిస్థితి నెలకొని ఉందన్నారు.

గాజాలోని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం యుద్ధం మొదలయ్యాక, ఇప్పటివరకూ 10,328 మంది మరణించగా, 24,408మంది గాయపడ్డారు. చనిపోయినవారిలో 67 శాతం మంది పిల్లలు, మహిళలు ఉన్నారు. మరో 2450మంది కనిపించకుండా పోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News