Thursday, January 23, 2025

ప్రభాస్ ఈజ్ బ్యాక్… (వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

డార్లింగ్ ప్రభాస్ ఇండియా తిరిగి వచ్చారు. ఆయన నెల రోజుల కిందట ఇటలీ వెళ్లి, తనను చాలాకాలంగా బాధిస్తున్న మోకాలి నొప్పికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. అక్కడే విశ్రాంతి తీసుకున్న ప్రభాస్, అకస్మాత్తుగా బుధవారం ఉదయం తన బృందంతో కలసి హైదరాబాద్ విమానాశ్రయంలో కనిపించారు.

ఈ దృశ్యాలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. సుప్రసిద్ధ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ‘సలార్’ సినిమా ప్రమోషన్ వర్క్ లో ప్రభాస్ పాల్గొంటారని తెలుస్తోంది. ‘సలార్’ డిసెంబర్ లో విడుదల కావలసి ఉంది. బాహుబలి షూటింగ్ సమయంలో ప్రభాస్ మోకాలికి గాయం తగిలినట్లు తెలిసింది. అయితే అప్పటికే అంగీకరించిన షూటింగ్ ల తాలూకు బిజీ షెడ్యూళ్ల వల్ల చికిత్సను వాయిదా వేస్తూ వచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News