Sunday, January 19, 2025

విద్యుత్ రంగంలో తెలంగాణ ఎంతో అభివృద్ది సాధించింది:కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర ఆవిర్భావం నాటికి నేటికి విద్యుత్ రంగంలో ఎంతో అభివృద్ధి సాధించామని ఐటి, .పరిశ్రమలశాఖ మంత్రిక కెటిఆర్ అన్నారు. మంగళవారం పార్క్‌ హయత్ హోటల్లో మంగళవారం పారిశ్రామికవేత్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి కల్వకుంట్ల రామారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఏడిఈ తుల్జాసింగ్ రాసిన“పవర్ పుల్ తెలంగాణ” పుస్తకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ విద్యుత్తురంగంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన పురోగతి, అభివృద్ధిని పుస్తకరూపంలో నిక్షిప్తం చేయడం అభినందనీయం అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్తురంగంలో వచ్చిన మార్పులను, దేశంలోని ఇతర రాష్ట్రాల్లోని విద్యుత్ రంగ ధీనస్థితిని విశ్లేషిస్తూ రచయిత, ఏడీఈ తుల్జారాంసింగ్ ఠాకూర్ పలు పత్రికల్లో విశ్లేషాణాత్మక వ్యాసాలు చక్కగా రాశారన్నారు. ఈ సమావేశంలో రచయిత తుల్జారాంసింగ్ ఠాకూర్, టీఈఈఏ అధ్యక్షులు ఎన్.శివాజీ ప్రధానకార్యదర్శి శివాజీ ,నాయకులు రవి, రాజేష్, ప్రవీణ్ కుమార్,శ్రవణ్ గుప్త, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News