Saturday, December 21, 2024

ప్రధాని మోడీ దివాళీ స్వదేశీ సందేశం..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రధాని మోడీ దివాళీ స్వదేశీ సందేశం వెలువరించారు. త్వరలో జరిగే దీపావళి పండుగను మనమంతా కలిసి దేశీయ ఉత్పత్తుల వాడకం నడుమ నిర్వహించుకుందామని ఆయన బుధవారం పిలుపు నిచ్చారు. స్థానికంగా ఎక్కడికక్కడ ఉత్పత్తి అయ్యే వస్తువులను కొనుక్కుందాం. వాటిని పర్వదినాన వాడుకుందాం. ఈ విధంగా స్వదేశీకి స్వస్థలికి ప్రాధాన్యత ఇద్దామని ప్రధాని కోరారు. అవి మిఠాయిలు కావచ్చు, బాణసంచా కావచ్చు. లేదా దుస్తులు కావచ్చు.

మట్టి ప్రమిదలు కావచ్చు ఎవైనా మనం స్థానికంగా తయారయ్యే వాటిని వాడుకుంటే మనమంతా దేశానికి జిందాబాద్ కొట్టినట్లే అవుతుందన్నారు. స్థానిక ఉత్పత్తులను కొనండి వాడండి, సంబంధిత సెల్ఫీలను తయారీదార్ల వివరాలతో నమో యాప్‌నకు పంపించండని ప్రధాని విజ్ఞప్తి చేశారు. ఓ సముచితమైన సానుకూలతను చాటుకునేందుకు ఈ ప్రయత్నం ఓ గొలుసుకట్టు ప్రక్రియ అవుతుందన్నారు. లోకల్‌కు పట్టం కట్టండి, ఇదే మన నినాదం చేసుకోండని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News