Friday, December 20, 2024

యంగ్ ఓటర్ ఫింగర్ ఎటువైపు..?

- Advertisement -
- Advertisement -

29ఏళ్ల లోపు యువ ఓటర్లు 62,58,084
సామాజిక మాధ్యమాల్లో వీళ్లదే హవా

పులగం మల్లికార్జున్/మనతెలంగాణ: రాష్ట్ర శాసనసభ ఎన్నికల సమరంలో యువ ఓటర్లు కీలకంగా మారనున్నారు. ప్రశ్నించే గుణం.. స్పందించే తత్వం కలిగిన యువత సహజంగానే ఎన్నికల్లో అత్యధికంగా ప్రభావితమవుతారు. ఎన్నికల తరుణంలో రాజకీయ చర్చల నుంచి మొదలుకొని అన్ని పార్టీల తరఫున ప్రచారం చేయడం, సాంకేతిక సహకారం అందించటం వరకు తమవంతుగా యువత పాలుపంచుకుంటుఉన్నారు. ఇటీవల ఓటు నమోదు, ఓటింగ్ శాతం పెంచటం, మంచి నాయకులను ఎన్నుకునేలా కార్యక్రమాలు సైతం ‘స్వచ్చంద సంస్థతో కలిసి యువ ఓటర్లు చేపట్టారు.

రాష్ట్రంలో 3,21,88,753 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. 72 లక్షల మంది 30 ఏళ్లలోపు ఓటర్లే. అత్యధిక జన సాంద్రత కలిగిన జిల్లాలో విద్యానుకూల పరిస్థితులు చైతన్యానికి దోహదం చేస్తున్నాయి. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో ఓటరు నమోదు కార్యక్రమాల్లో యువత క్రియాశీలకంగా పాల్గొని.. దాదాపు 9,10,810 మంది 19 ఏళ్ల లోపు యువత తమ ఓటుహక్కును నమోదు చేసుకోవటం విశేషం. మొత్తం ఓటర్లలో 20 నుంచి 29 సంవత్సరాల్లోపు వారి సంఖ్య 63 లక్షల వరకు ఉండగా వీరు ఈ ఎన్నికల్లో కీలకంగా మారనున్నారు.

కళాశాలల విద్యార్థులు, ఉద్యోగాలు, వ్యవసాయం చేస్తున్న యువతీ యువకులు ఎన్నికల నియమావళి నుంచి నిబంధనలు అనుసరణ, అతిక్రమణలపై స్పందించటం తదితరాల్లో కీలకంగా ఉంటున్నారు. జిల్లాలో పట్టణ, గ్రామీణ ప్రాంతాలనే తేడాలేకుండా చాలా మంది కనీసం చదువుకున్నవారే ఉండటంతో ప్రస్తుత సామాజిక మాధ్యమాల ద్వారానూ వీరు ఓటరు చైతన్యం, ఓటు నమోదు. వేయటం పోలింగ్, పార్టీల పాత్ర తదితర చాలా అంశాలపై పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. వ్యక్తిగతంగా, గ్రూపులుగానూ సామాజిక మాధ్యమాల్లో చురుగా ఉండగా వీరిలో కొందరు పార్టీల ద్వారానూ ప్రచారంలో పాలుపంచుకుంటున్నారు.

పార్టీల ప్రచారంలో క్రియాశీలకంగా..
శాసనసభ ఎన్నికల ప్రచారంలో యువత కీలక భూమిక వహిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా వివిధ పార్టీల అభ్యర్థుల ప్రచారంలో వారు ముందుంటున్నారు. ప్రధాన రాజకీయ పక్షాలు ఇటీవల ప్రకటించిన అభ్యర్థుల్లో యువ నాయకులు సైతం పదుల సంఖ్యలో ఉండడంతో వారి ప్రభావాన్ని గుర్తుచేస్తోంది. ఈ దఫా జరిగే ఎన్నికలలో పార్టీలు అధికారంలోకి రావడంలో యువ ఓటర్ల చైతన్యం కీలకంగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News