Friday, November 22, 2024

ఇల్లందులో బిఅర్ఎస్ పార్టీకి షాక్..

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో బీఅర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర రావు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ చేరారు. గురువారం ఉదయం తుమ్మల  నాగేశ్వరరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో వెంకటేశ్వర రావు చేరారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ…జిల్లా అభివృద్ధి కోసం గోదావరి జలాలతో సస్య శ్యామలం చేయాలని నాడు టీఅర్ఎస్ లో చేరానని అన్నారు.తనతో పాటు వేలాది మంది పార్టీలో చేరారని..అహంకార చర్యల వల్ల పార్టీ పెద్దలే ఓడించాలని చూశారని చెప్పారు.

జిల్లాలో పార్టీ అభివృద్ధికి పాటు పడ్డానని…చందాలు, దందాలు, అవినీతి అరాచక పాలనతో బీఅర్ఎస్ పార్టీని వదిలేశానని తుమ్మల అన్నారు. తెలంగాణ కల సాకారం చేసిన సోనియమ్మ, రాహుల్ గాంధీ నాయకత్వంపై విశ్వాసంతో కాంగ్రెస్ లో చేరానని తెలిపారు. ఇల్లందు మున్సిపల్ చైర్మన్ గా డీవీ అభివృద్ధికి పాటుపడ్డారని ఆయన చెప్పారు.తుమ్మలకు ముందు ఇల్లందు గుండాల ఏంటో.. తుమ్మల వచ్చిన తరువాత ఇల్లందు గుండాల ఏంటో చరిత్రలో చూశారని అన్నారు.

ఇల్లందు నియోజకవర్గంలో రహదారులు ఏర్పాటుతోపాటు విద్య, వైద్యం ఏజెన్సీ వాసులకు దక్కాయన్నారు. తనను నమ్మి కాంగ్రెస్ పార్టీలో చేరిన మున్సిపల్ చైర్మన్ డీవీకి కాంగ్రెస్ లో భవిష్యత్ భాద్యత తనదన్నారు. ఇల్లందు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోరం కనకయ్యను గెలిపించాలని తుమ్మల పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News