Monday, December 23, 2024

షమీని పెళ్లి చేసుకుంటా: నటి పాయల్

- Advertisement -
- Advertisement -

టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ వన్డే ప్రపంచ కప్ లో దుమ్ములేపుతున్నాడు. మొదటి నాలుగు మ్యాచ్ లలో బెంచ్ కే పరిమితమైన షమీ, ఆ తర్వాత జట్టులో చోటు సంపాదించుకున్నాడు. నాలుగు మ్యాచ్ లు ఆడి 16 వికెట్లు తీసి, ఇండియా విజయాలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాడు. ఇప్పుడు ఎక్కడ చూసినా అతని పేరు మారుమోగిపోతోంది. ప్రస్తుత ప్రపంచ కప్ లో టీమిండియా తరఫున ఎక్కువ వికెట్లు తీసింది షమీనే.

షమీ పెర్మార్ఫెన్స్ కి తాజాగా ఓ హీరోయిన్ పడిపోయింది. అతన్ని పెళ్లి చేసుకునేందుకు సిద్దమంటూ ట్వీట్ చేసింది. ఆ హీరోయిన్ పేరు పాయల్ ఘోష్. ఊసరవెల్లి సినిమాలో తమన్నా స్నేహితురాలిగా నటించిన పాయల్, ప్రస్తుతం బాలీవుడ్ లో అవకాశాలు వెతుక్కుంటోంది. షమీని పెళ్లి చేసుకునేందుకు ముందుకొచ్చిన పాయల్, అందుకు ఓ కండిషన్ పెట్టింది. షమీ ఇంగ్లీషు మాట్లాడటం మెరుగు పరచుకోవాలని, అప్పుడే పెళ్లి చేసుకుంటానని పాయల్ ట్వీటింది. అలాగే, సెమీస్ లో ఇండియా నెగ్గాలంటే తాను ఏం చేయాలో చెప్పమని కూడా పాయల్ షమీని అడిగింది.

ఇక షమీకి ఇప్పటికే పెళ్లయి, ఓ కూతురు కూడా ఉందన్న సంగతి తెలిసిందే. షమీ భార్య హసీన్ జహాన్ భర్తనుంచి విడాకులు తీసుకుని దూరంగా ఉంటోంది. ఇటీవలే వీరి కేసును పరిష్కరించిన కోల్ కతా కోర్టు, ప్రతి నెలా హసీన్ కు లక్షా 30 వేల రూపాయలను భరణంగా చెల్లించాలని షమీని ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News