Monday, December 23, 2024

కేసీఆర్ కు 17 కోట్ల అప్పు

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్ కు 17 కోట్ల రూపాయల అప్పు ఉంది. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. స్వయంగా కేసీఆరే ఈ విషయాన్ని తన అఫిడవిట్లో పేర్కొన్నారు. గజ్వేల్, కామారెడ్డిలో గురువారం నామినేషన్ వేసిన కేసీఆర్, ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లలో తన ఆస్తులు-అప్పుల వివరాలను పేర్కొన్నారు.

అఫిడవిట్లో పేర్కొన్న వివరాల ప్రకారం కేసీఆర్ కు 17.27 కోట్ల రూపాయల అప్పు ఉంది. ఆయన కుటుంబానికి 7.23 కోట్ల అప్పు ఉంది. కేసీఆర్ పేరిట తొమ్మిది, ఆయన సతీమణి శోభ పేరుమీద మూడు బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. గత ఎన్నికల సమయానికి కేసీఆర్ పేరు మీద ఫిక్స్ డ్ డిపాజిట్లు, సేవింగ్స్ మొత్తం 5.63 కోట్లు ఉండగా, ఇప్పుడు ఆ మొత్తం 11.16 కోట్లు అయింది.  తన పేరు మీద భూమి గానీ, కారు గానీ లేవని కేసీఆర్ అఫిడవిట్ లో పాల్గొన్నారు. అయితే తన కుటుంబానికి ఉమ్మడిగా 53.30 ఎకరాల సాగుభూములు, 9.36 ఎకరాల వ్యవసాయేతర భూములు ఉన్నట్లు పేర్కొన్నారు. తనకు 17.83 కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తులు, 9.67 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News