Monday, December 23, 2024

మధిరలో భట్టి విక్రమార్క నామినేషన్

- Advertisement -
- Advertisement -

మధిర :- మధిర నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి గా సిఎల్పీ నేత భట్టి విక్రమార్క నామినేషన్ దాఖలు చేస్తున్న సందర్భంగా వైరా శబరి నగర్ లోని అయ్యప్ప దేవాలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుని వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. ఆ తర్వాత స్థానిక సాయిబాబా ఆలయంలో పూజలు నిర్వహించారు. భట్టి విక్రమార్క స్వగ్రామమైన వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామంలోని పా ర్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు. తదుపరి కృష్ణాజిల్లా నెమలి గ్రామంలో శ్రీకృష్ణ దేవా లయాన్ని భట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా సందర్శించి ప్రత్యేక పూజలు జరిపారు.

అక్కడి నుంచి నేరుగా మధిరకు క్యాంపు కార్యాలయానికి బయలు దేరారు. అనంతరం భట్టి నామినేషన్ వేసే సందర్భంగా అశేష జన వాహితో ర్యాలీగా బయలుదేరి వచ్చినారు. ఈ కార్యక్రమంలో భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని విక్రమార్క, కుమారుడు మల్లు సూర్య విక్రమాధిత్య, వైరా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాందాస్ నాయక్, ఖమ్మం డిసిసి అధ్యక్షులు వాళ్ళ దుర్గా ప్రసాద్, స్థానిక కాంగ్రెస్ నాయకులు, మండల కాంగ్రెస్ నాయకులు, వేలాదిమంది బట్టి అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News