Saturday, December 21, 2024

రాష్ట్రంలో రెండు రోజులు వర్షాలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రెండు రోజులు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు తెలిపింది. తూర్పు ఆగ్నేయ దిశల నుంచి బంగాళాఖాతం మీదుగా తెలంగాణ రాష్ట్రంవైపునకు కిందిస్థాయిలో గాలులు వీస్తున్నట్టు తెలిపింది. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలోని పలు చోట్ల ఒక మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడ్డాయి. నారాయణపేట జిల్లా జక్లైర్‌లో 16.5 మి.మి వర్షం కురిసింది. కొడైర్‌లో 15, ప్రొద్దటూర్‌లో 12.8, రాపోల్‌లో 11.8, పేద్దూర్‌లో 11.5,అమరచింతలో 9.5, బొమరాస్‌పేట్‌లో 9, రేమద్దులలో 8.5 తాండూర్‌లో 8.5, కొండుర్గ్‌లో 8, చౌటుప్పల్‌లో 8, వనపర్తిలో 7.3, మొయినాబాద్‌లో 6.8 మి.మి చొప్పున వర్షం కురిసింది. మిగిలిన మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News