Friday, December 20, 2024

ఓన్లీ వన్ రియల్ ఫైటర్

- Advertisement -
- Advertisement -

కెసిఆర్..అతడే ఒక సైన్యం..
ఉద్యమం నుంచి పునర్నిర్మాణం దాకా..
దేశంలోనే నంబర్‌వన్‌గా తీర్చిదిద్దిన ఘనత
ప్రజాబలం..కెసిఆర్‌కే సొంతం
కృష్ణార్జులుగా హరీశ్,కెటిఆర్ మార్క్

ఉద్యమం కావచ్చు..ఎన్నికలు కావచ్చు..రాజకీయం కావచ్చు. ఆయన స్కెచ్ వేశారంటే అది నూటికి నూరుపాళ్లు విజయవంతమే. ఆయనే నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేత, నేటి తెలంగాణ విధాత కెసిఆర్. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొని తెలంగాణ దశ, దిశను మార్చి జెట్ స్పీడ్‌తో 2023 అసెంబ్లీ ఎన్నికలను 100+ టార్గెట్‌తో ఎన్నికల ప్రచారంలో ముందుకు
సాగుతున్నారు. ఆయనకు కుడి, ఎడమ భుజాలుగా కెటిఆర్, టి.హరీశ్‌రావులు 100+ టార్గెట్ మిషన్ విజయవంతం చేసే పనిలో తలమునకలయ్యారు. కెసిఆర్ మాటే తమ బాటగా ప్రగతి భవన్ వార్ రూమ్ నుంచి హ్యాట్రిక్ విజయాన్ని సాధించడానికి 24X7 శ్రమిస్తున్నారు.
ఎం.భుజేందర్/ మనతెలంగాణ:  ఒకప్పటి ఉద్యమాల తెలంగాణ ఇప్పుడు ఉజ్వల తెలంగాణగా మారిం ది. అసలు తెలంగాణ ఏర్పాటు సాధ్యమేనా అనే అనుమానాల నుంచి ఇదీ తెలంగాణ అంటే అనేవిధంగా ఆదర్శంగా తయారైంది. 60 ఏండ్ల నాటి కల నిజమై అప్పుడే దశాబ్దంలోకి అడుగుపెట్టింది. సర్వతోముఖాభివృద్ధితో దూసుకుపోతున్న తెలంగాణను చూసినవారంతా నాటి ఉద్యమంలో మేమున్నామంటే మేమున్నామని చెప్పుకొంటున్నారు. కానీ వారిలో చాలామంది తెలంగాణ సాధ్యమైతదని, అద్భుత ప్రగతిని సాధిస్తుందని ఏ మాత్రం ఊహించలే. ఒక్కడంటే ఒక్కడే తెలంగాణ వస్తది.. అది బంగారు తెలంగాణగా మారుతదని నమ్మిండు. ఆ ఒక్కడే బక్క పలచని ఉక్కు సంకల్పం కలిగిన వ్యక్తి కెసిఆర్. రాజకీయ పోరాటం ద్వారానే తెలంగాణ సాధ్యమైతదనే నిర్ణయానికి వచ్చి 2001లో కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్‌ఎస్) పార్టీని స్థాపించారు.

అంతకు ముందే తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్నప్పటికీ ఎప్పుడైతే కెసిఆర్ టిఆర్‌ఎస్ పార్టీ స్థాపించారో అప్పుడే మలిదశ తెలంగాణ ఉద్యమం తీవ్రతరమైంది. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకునేందుకు సీమాంధ్రులకు కావాల్సిన రాజకీయ, మీడియా, ఆర్థిక బలం పుష్కలంగానే ఉన్నది. మనదేశంలోని రాజకీయ వ్యవస్థలో పొలిటికల్ నంబర్ గేమ్‌దే కీలక పాత్ర. కనీసం ఎంపి, ఎంఎల్‌ఎ స్థానాలు ఎక్కువున్నా తెలంగాణను అడుగగలం. కానీ రాజకీయ లెక్కలుచూసినా సరే ఆంధ్రా, రాయలసీమనే బలంగా ఉన్నది. అందుకే చాలామందికి తెలంగాణ వస్తదన్న నమ్మకం కలుగలేదు. కానీ కెసిఆర్ మాత్రం టిఆర్‌ఎస్ స్థాపించినప్పటి నుంచి నిద్రలో లేపి అడిగినా కచ్చితంగా తెలంగాణ వస్తదనే చెప్పేవారు. మిగతా వారి కన్నా భిన్నంగా ఆలోచించటమే కెసిఆర్ ప్రత్యేకత. రాజీనామా ల ద్వారా ఎప్పటికప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని రగిలిస్తూ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అవసరమైన రాజకీయ ప్రక్రియను వ్యూహాత్మకంగా వేగవంతం చేశారు. కెసిఆర్ చచ్చుడో… తెలంగాణ వచ్చుడో” అనే ముందుకు కదిలిండు. ఉద్యమం నుంచి పక్కకు తప్పుకుంటే రాళ్లతో కొట్టి చంపండని ప్రజలతోనే అన్నారు. గతంలో ఏ నాయకుడు కూడా ఇంత ధైర్యంగా బహిరంగ ప్రకటన చేయలేదు. లక్ష్యంపై ఎంత స్పష్టత ఉంటే ఇలాంటి ప్రకటన చేసి ఉంటారో అర్థం చేసుకోవచ్చు.

మలిదశ తెలంగాణ ఉద్యమంలో కర్త, కర్మ, క్రియ అన్నీ కెసిఆరే.అందులో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. కెసిఆర్ కాకుండా ఇం కెవరైనా ఉద్యమ నాయకుడై ఉంటే తెలంగాణ రాకపోయేదన్నది అక్షరసత్యం. కెసిఆర్ ఒక సంకల్పం తీసుకుంటే దాని మీద ఎంత గొప్పగా పనిచేస్తారో తెలిపిన సంఘటనే తెలంగాణ ఉద్యమం. గుప్పెడు మందితో ప్రారంభమై కోట్లాది మంది నినాదంగా తెలంగాణ మారిందంటే అది ముమ్మాటికీ కెసిఆర్ ఘనతే. ఆధునిక భారతదేశం చూసిన అత్యద్భుతమైన ఓ పోరాటం కెసిఆర్ ఆధ్వర్యంలోని తెలంగాణ ఉద్యమం. 2009 వరకు అతడే ఒక సైన్యం. ఆ తర్వాత కెసిఆర్ అంటే మొత్తం తెలంగాణ. అట్ల ఎంతోమంది జీవితకాలంలో కూడా సాధ్యం కాని లక్ష్యం కేసీఆర్‌కు సాకారమైంది.

సిఎంగా ప్రతి సమస్యను సవాల్‌గా తీసుకుని పరిష్కరిస్తున్న కెసిఆర్  ప్రత్యేక రాష్ట్ర సాధన తర్వాత కూడా కెసిఆర్ సంతృప్తి చెందలేదు. ఎన్నో పోరాటాలు, త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణ పునర్నిర్మాణ బాధ్యత కూడా కెసిఆరే తన భుజాన వేసుకున్నారు. తెలంగాణ వస్తే ఏ సమస్యలు వస్తాయని అప్పట్లో చాలా మంది చెప్పారో వాటన్నింటిని సవాల్‌గా తీసుకొని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నారు. తెలంగాణ అసాధ్యమంటే ఏ విధంగా సాధించారో, పునర్నిర్మాణ ప్రక్రియలోనూ అసాధ్యమన్న చాలా విషయాలను సాధించి చూపిస్తున్నారు. ఇప్పుడు అన్ని రంగాల్లో తెలంగాణ నంబర్ వన్ స్థాయిలో ఉన్నది. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ అగ్రభాగాన నిలిచింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కెసిఆర్ సీఎం కాకపోయి ఉంటే కచ్చితంగా ఇప్పుడు చూస్తున్న ఉజ్వల తెలంగాణను మనం చూసేవాళ్లం కాదు. దేశంలో తెలంగాణ నంబర్‌వన్ కావటం గ్యారెంటీ అని నమ్ముతున్న వ్యక్తి కెసిఆర్ మాత్రమే. అందుకే మరోసారి ప్రజలు ఆయనకే పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు.

అన్నీ తానై కదనరంగంలోకి కెటిఆర్

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.టి. రామారావు వ్యూహాత్మకంగా కదనరంగంలోకి దిగారు. నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూనే అన్నీ తానై పా ర్టీని నడిపిస్తున్నారు. ఎన్నికలకు గులాబీ సైన్యాన్ని పూర్తిస్థాయిలో సిద్ధం చేయడంతో పాటు పార్టీలో అసంతృప్తులను దారిలోకి తెచ్చుకున్నారు. తమపై ప్రత్యర్థులు చేసే విమర్శలను సమర్థవంతంగా తిప్పికొడుతూనే మళ్లీ బిఆర్‌ఎస్‌కే తెలంగాణ ప్రజలు ఎందుకు పట్టం కట్టాలో వివరిస్తూ ప్రజలు చర్చించుకునే ప్రసంగాలు చేస్తున్నారు. పార్టీ కేడర్‌ను పూర్తిస్థాయిలో సమన్వయం చేస్తూనే రాజకీయాలపై మేధావులు, ప్రముఖులు, సామాన్య ప్రజలతో తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు. సోష ల్ మీడియాలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే కెటిఆర్ తమకు ఏదైనా సమస్య ఉందని సాధారణ ప్రజలు ఒక్క ట్వీట్ చేసినా వెంటనే స్పందించి పరిష్కరిస్తారు. రాష్ట్రాభివృద్ధికి భవిష్యత్తు ప్రణాళిక, రాజకీయాల్లోనూతనోత్తేజంపై తన గొం తుకను క్షేత్రస్థాయికి వినిపిస్తున్నారు. మూడోసారి అధికార పీఠాన్ని దక్కించుకోవడమే ధ్యేయంగా అకుంఠిత దీక్షతో, పట్టుదలతో కెటిఆర్ అన్నీ తానై వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

బిఆర్‌ఎస్ ట్రబుల్ షూటర్ హరీశ్‌రావు

తన్నీరు హరీశ్‌రావు….అహర్నిశలు కష్టించే కష్టజీవి… ఆత్మీయతకు, అభిమానానికి, ఆదరణకు నిదర్శనం. 32 ఏళ్లకే తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన హరీశ్‌రావు, అప్పటినుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. తెలంగాణలో బలమైన రాజకీయ నాయకుడిగా ఎదగడమే కాకుండా.. బిఆర్‌ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్‌గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఇటీవల పార్టీకి దూరమైన ఉద్యమ నేతల ఘర్ వాపసీ వెనుక హరీశ్ కృషి ప్రధాన కారణం. అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధిపేట నియోజకవర్గం నుంచి వరుసగా ఆరుసార్లు ఎంఎల్‌ఎగా గెలిచిన హరీశ్‌రావు.. పిన్న వయస్సులోనే ఈ ఘనత సాధించిన రాజకీయ నాయకుడిగా చరిత్ర సృష్టించారు.

నాటి తెలంగాణ ఉద్యమం నుంచి నేటి తెలంగాణ రాష్ట్రాభిభివృద్ధి వరకు కెసిఆర్ సంకల్ప సిద్ధిని శిరసావహించి కార్యరూపంలో పెట్టిన నేత. మంత్రిగా, పార్టీ నేతగా తెలంగాణ నలుమూలలా బుల్లెట్ వేగంతో చుట్టేస్తూ ప్రజల పక్షాన నిలబడే నిబద్ధత కలిగిన నాయకుడు హరీశ్‌రావు. చిన్న మెసేజ్ పెట్టినా చాలు, తాను స్వయంగా పరిశీలించి సమస్యకు పరిష్కారం చూపుతారు.అధికారులను, పార్టీ నాయకులను పంపి సమస్య లేకుండా చూస్తారు. హరీశ్‌రావు ఏ నియోజకవర్గంలో అ డుగు పెడితే అక్కడ పార్టీ విజయం సాధిస్తుందని బలమైన నమ్మకం బిఆర్‌ఎస్ పార్టీలో ఉంది. అందుకే, ఆయన ట్రబుల్ షూటర్‌గా పేరు తె చ్చుకున్నారు. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ తీరిక లేకుండా బాధ్యతలు ని ర్వహిస్తున్నారు. ఇరిగేషన్ మంత్రిగా “కాళేశ్వరం” ప్రాజెక్టు నిర్మాణంలో కార్మికుడిలా చెమటోడ్చి పని చేశారు. ఆర్థిక మంత్రిగా ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టారు. తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రిగా హరీశ్‌రా వు బా ధ్యతలు తీసుకుని గురువారానికి(నవంబర్ 9) సరిగ్గా రెండేళ్లు. ఈ రెం డు సంవత్సరాలలో ఆరోగ్య మంత్రిగా మంత్రి హరీశ్‌రా వు తెలంగా ణ ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి జి ల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు, మాతా శిశు మరణాల తగ్గింపు, వైద్యు లు, నర్సిం గ్ సిబ్బంది నియామకాలు, ప్రభుత్వాసుపత్రుల్లో అత్యాధునిక సౌకర్యాల క ల్పన, ప్రభుత్వాసుపత్రుల్లో ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వంటి ఎన్నో నిర్మాణాత్మక పనులు చేసి ఆరోగ్య రంగంలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపారు. కెసిఆర్ నమ్మినబంటుగా ఆయన ఇచ్చే ప్రతి టాస్క్‌ను విజయవంతంగా హరీశ్ నిర్వర్తిస్తారని పార్టీ వర్గాలు చెబుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News