Saturday, December 21, 2024

కామారెడ్డిలో కాంగ్రెస్ బిసి డిక్లరేషన్ సభ

- Advertisement -
- Advertisement -

కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ శుక్రవారం బిసి డిక్లరేషన్ సభ నిర్వహిస్తోంది. బిసి డిక్లరేషన్ సభకు కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కోదండరామ్, నారాయణ, చాడ వెంకట్ రెడ్డితో పాటు పలువురు కీలక నేతలు హాజరయ్యారు. బిసి వర్గాల కోసం కాంగ్రెస్ చేపట్టే కార్యక్రమాలతో డిక్లరేషన్ ను విడుదల చేయనున్నారు. కామారెడ్డిలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అగ్రనేతలు పోటీ పడుతుండడంతో ఇరు పార్టీలు ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించి ఆ స్థానం నుంచి గెలుపును ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాయి. కొడంగల్ నియోజకవర్గం నుంచి కూడా రేవంత్ రెడ్డి పోటీ చేయనున్నారు. అభిమానుల కోలాహలం మధ్య టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో కలిసి శుక్రవారం మధ్యాహ్నం కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News