Monday, January 20, 2025

‘గీతా శంకరం’ ఫస్ట్‌లుక్‌ లాంచ్‌

- Advertisement -
ఎస్‌.ఎస్‌.ఎం.జి ప్రొడక్షన్స్‌ పతాకంపై ముఖేష్‌గౌడ`ప్రియాంక శర్మ జంటగా నూతన దర్శకుడు రుద్ర దర్శకత్వంలో ప్రముఖ వ్యాపారవేత్త కె. దేవానంద్‌ నిర్మిస్తున్న ప్రేమకథా కావ్యం ‘గీతా శంకరం’. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం సంస్థ కార్యాలయంలో ఆవిష్కరించారు.

- Advertisement -

ఈ సందర్భంగా నిర్మాత దేవానంద్‌ మాట్లాడుతూ… మా ఇష్టదైవమైన శ్రీ సెల్వమహాగణపతి పేరుపై ఆయన దీవెనలతో స్థాపించిన మా ‌ఎస్‌.ఎస్‌.ఎం.జి సంస్థ పేరు మీద ప్రారంభించిన ప్రతి పని విజయవంతంగా పూర్తి చేశాము. తొలిసారిగా చిత్ర నిర్మాణంలోకి అడుగుపెడుతున్నాము. ఇక్కడ కూడా తప్పకుండా విజయం సాధిస్తామనే నమ్మకం ఉంది. ఇదొక మంచి ప్రేమకథా దృశ్య కావ్యం. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉంది. ఈనెల 14 నుంచి కొత్త షెడ్యూల్‌ మొదలవుతుంది. సినిమా తీయాలని నిర్ణయించుకోగానే దాదాపుగా 20 మంది కథలు చెప్పారు. కానీ దర్శకుడు రుద్ర చెప్పిన పాయింట్‌ నాకు బాగా నచ్చింది. అందుకే ఈ సినిమా ప్రారంభించాం. అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలతో ప్రేక్షకులను అలరిస్తుందని కాన్ఫిడెంట్‌గా చెప్పగలను. ఇందుకోసం యూనిట్‌ అందరూ కష్టపడి పని చేస్తుండడం చాలా హ్యాపీగా ఉంది అన్నారు.

నటుడు మురళీధర్‌ మాట్లాడుతూ… విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ఈ కథలో నేను హీరోయిన్‌ తండ్రిగా నటిస్తున్నాను. మంచి ప్రాధాన్యం ఉన్న పాత్ర. ప్రేక్షకులందరి ఆదరణ, ప్రోత్సాహంతో ఈ ‘గీతా శంకరం’ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా అన్నారు.

దర్శకుడు రుద్ర మాట్లాడుతూ… నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చిన నా నిర్మాత దేవానంద్‌ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే సినిమా అద్భుతంగా రావటానికి నాతోపాటు కష్టపడుతున్న ఆర్టిస్ట్‌లకు, టెక్నీషియన్స్‌కు నా కృతజ్ఞతలు. రెండేళ్లుగా ఈ కథను తెరకెక్కించాలని చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు ఫలించాయి. మీడియా కూడా సపోర్ట్‌ చేయాలని కోరుకుంటున్నా. అందరికీ నచ్చే అంశాలతో తెరకెక్కుతోంది అన్నారు.

హీరో ముఖేష్‌గౌడ మాట్లాడుతూ… ఈ దీపావళి కానుకగా నేను నటిస్తున్న తొలి సినిమా ఫస్ట్‌లుక్‌ లాంచ్‌ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ కథకు నన్ను హీరోగా సెలక్ట్‌ చేసుకున్న దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. లవ్‌ అండ్‌ ఎఫక్షన్‌తో కూడుకున్న సినిమా. సీరియల్స్‌లో ఎలా మంచి నటుడిగా పేరుతెచ్చుకున్నానో.. ఈ సినిమాతో వెండితెర మీద కూడా మంచి పేరు తెచ్చుకుంటాననే గట్టి నమ్మకం ఉంది. యూత్‌కు బాగా నచ్చుతుంది మా ‘గీతా శంకరం’ అన్నారు.

హీరోయిన్‌ ప్రియాంక శర్మ మాట్లాడుతూ… నటనకు స్కోప్‌ ఉన్న పాత్రలో నటించే అవకాశం రావడం నేను చాలా అదృష్టంగా ఫీలవుతున్నాను. దర్శకుడు రుద్ర గారి డ్రీమ్‌ ప్రాజెక్ట్‌లో కీలకమైన గీత పాత్రకు నన్ను ఎంచుకోవడం చాలా హ్యాపీగా ఉంది. దీపావళి సందర్భంగా ఫస్ట్‌లుక్‌ లాంచ్‌ కావడం మరింత సంతోషంగా ఉంది. ఇలాంటి స్క్రిప్ట్‌ ఓ ఆర్టిస్ట్‌కు రావడం అంత ఈజీగా జరగదు. నాకు రావడం దేవుడి దయ అనుకుంటున్నాను. నాకు సహకరిస్తున్న యూనిట్‌ అందరికీ థ్యాంక్స్‌ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News