రంగారెడ్డి: వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తల జయ జయ ద్వానాల మధ్య రాష్ట్ర మంత్రి పట్లోళ్ల సబితారెడ్డి తన నామినేషన్ దాఖలు చేశారు. దివంగత ఇంద్రారెడ్డి సమాధి వద్ద నామినేషన పత్రాలను ఉంచి నివాళి అర్పించారు. అనంతరం మంత్రి సబిత చిల్కూర్ బాలాజీ దేవాలయం, ఆరమైసమ్మ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదే విధంగా కర్మన్‌ఘట్ హన్‌మాన్ దేవాలయంలో ఎంపి రంజిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల క్రిష్ణారెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్ అనితారెడ్డి తదితరులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి ర్యాలీగా బయలుదేరారు. కర్మన్‌ఘట్ హన్‌మాన్ దేవాలయం నుంచి మహేశ్వరం వరకు వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. సబితారెడ్డి నామినేషన్ దాఖలుకు స్వచ్ఛందంగా వేలాది మంది తరలివచ్చి తమ మద్దతును ప్రకటించారు. బాలాపూర్, తుక్కుగూడ, మహేశ్వరంలో భారీ క్రేన్‌ల సహాయంతో సబిత మెడలో పూల మాలలు వేశారు.
అట్టహసంగా మంత్రి సబిత నామినేషన్
- Advertisement -
- Advertisement -
- Advertisement -