Monday, December 23, 2024

శ్రీలంక క్రికెట్ బోర్డుపై వేటు

- Advertisement -
- Advertisement -

లండన్: శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్‌ఎల్‌సి) సభ్యత్వాన్ని సస్పెండ్ చేస్తూ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) సంచలన నిర్ణయం తీసుకుంది. శుక్రవారం లండన్‌లో సమావేశమైన ఐసిసి బోర్డు లంక బోర్డుపై సస్పెండ్ విధించాలని తీర్మానించింది. ఈ సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుందని ఐసిసి స్పష్టం చేసింది. సస్పెన్షన్‌కు సంబంధించిన షరతులను ఐసిసి బోర్డు నిర్ణీత సమయంలో నిర్ణయిస్తుందని వివరించింది.

ఐసిసి సభ్య దేశంగా శ్రీలంక తన బాధ్యతలను ఉల్లంఘించిందని, శ్రీలంక క్రికెట్ స్వయం ప్రతిపత్తితో వ్యవహరించలేక పోతోందని ఐసిసి ఆరోపించింది. శ్రీలంక క్రికెట్‌లో ఆ దేశ ప్రభుత్వం జోక్యం చేసుకోవడంపై ఐసిసి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. శ్రీలంక బోర్డు స్వతంత్రంగా వ్యవహరించేంత వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని ఐసిసి వెల్లడించింది. కాగా, నవంబర్ 21న ఐసిసి బోర్డు భేటి అవుతుందని, ఆ తర్వాతే భవిష్యత్తు కార్యచరణపై తుది నిర్ణయం వెల్లడిస్తామని ఐసిసి శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో వివరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News