- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్: నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 15న అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 14నుంచి ఈశాన్య ,తూర్పు గాలులు బలోపేతం కానున్నాయి. తూర్పు ఆగ్నేయ దిశలనుంచి కింది స్థాయిలో గాలులు తెలంగాణ రాష్ట్రం వైపు వీస్తున్నాయి. రాష్ట్రంలో సోమవారం వరకూ పొడి వాతావరణం నెలకొంటుందని వాతావరణ శాఖ తెలిపింది. నవంబర్ 15 తర్వాత వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.
- Advertisement -