- Advertisement -
హైదరాబాద్: చివరి నిమిషంలో తనకు టికెట్ నిరాకరించడం పట్ల అసంతృప్తితో రగిలిపోతున్న వేములవాడ బిజెపి నేత తుల ఉమా తో బిఆర్ఎస్ నేతలు రెండు గంటలకు పైగా చర్చలు జరిపారు. సిరిసిల్ల తెలంగాణ భవన్ వేదికగా వినోద్ కుమార్ తుల ఉమా తో మాట్లాడారు. ఆ తర్వాత బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఉమతో ఫోన్ లో మాట్లాడారు. మరికాసేపట్లో ఉమ ఇంటికి వినోద్ కుమార్ బిఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు వెళ్లనున్నారు. రేపు కెటిఆర్ సమక్షంలో తుల ఉమా బిఆర్ఎస్ లో చేరనున్నట్లు సమాచారం.
- Advertisement -