Monday, December 23, 2024

తెలంగాణ ఎన్నికల పోరు: మ్యానిఫెస్టో లేని ఏకైక పార్టీ ఎఐఎంఐఎం..?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఎన్నికలు ఏవైనా ప్రధాన రాజకీయ పార్టీలు వాగ్దానాలు చేస్తుంటాయి. తాము అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో రాత పూర్వకంగా మ్యానిఫెస్టో పేరుతో ప్రకటిస్తాయి. వాటిని అమలు చేస్తారా అనేది అటుంచితే ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేయడం అన్ని రాజకీయ పార్టీల్లో జరుగుతుంది. జాతీయ స్థాయికి ఎదగడానికి ప్రయత్నిస్తూ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్న అఖిల భారత మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎఐఎంఐఎం) పార్టీ మాత్రం అందుకు అతీతం అని చెప్పవచ్చు. అసెంబ్లీ ఎన్నికలు అయినా, పార్లమెంటు ఎన్నికలు అయి నా, స్థానిక సంస్థల ఎన్నికలు అయినా ఏ ఎన్నిక అయినా మ్యానిఫెస్టో రూపంలో ప్రజలకు వాగ్దానం చేయడం ఆ పార్టీ చరిత్రలో లేదు.

ఏ నాడు మ్యానిఫెస్టో విడుదలకు ప్రయత్నించిన దాఖలాలు లేదు. ఎంఐ ఎం సుప్రీమ్ అసదుద్దీన్ ఓవైసి స్వయంగా ఈ విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎల్లప్పుడు ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం పనిచేసే తమకు మ్యానిఫెస్టో ఎందుకని అనడం గమనార్హం. తాము ఎప్పుడూ ప్రజల్లో ఉంటూ పనిచేయడమే తమ మ్యానిఫెస్టో అని చమత్కరించడం గమనార్హం. నిజానికి ఆ పార్టీ పరిమిత సంఖ్యలో పనిచేస్తుందన్న విషయం అందరికి తెలిసిందే. ఎలాగూ అధికారంలోకి వచ్చేది ఉండదు. ఎక్కడ పోటీ చేసినా ముస్లిం మైనారిటీ ఓటర్లు అధికంగా ఉండే నియోజవర్గాల్లోనే ఆ పార్టీ అభ్యర్థులను నిలబెడుతుంది.

అది తెలంగాణలో అయినా ఇతర రాష్టాల్లో అయినా ఆ పార్టీ తీరే అది. ఉత్తరాదిన అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఆ పార్టీ పోటీ చేస్తూ వస్తోంది. కొన్ని రాస్ట్రాల్లో ఎంఎల్‌ఎ సీట్లతో పాటు ఒక ఎంపి సీటును కూడా ఆ పార్టీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. మున్సిపాలిటీల్లో కార్పోరేటర్, వార్డు మెంబర్‌లుగా కూడా ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేసి విజయం సాధించిన సందర్భాలు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News