Monday, December 23, 2024

రేస్ నుంచి స్కాట్ ఔట్..

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల రేస్ నుంచి తాను వైదొలుగుతున్నట్లు రిపబ్లికన్ పార్టీ పోటీదారు టిమ్ స్కాట్ ప్రకటించారు. ఆదివారం రాత్రి ఆయన తన నిర్ణయం వెలువరించారు. 2024 అధ్యక్ష పోటీ బరి నుంచి ఉపసంహరించుకుంటున్న విషయాన్ని ఈ సౌత్ కరోలినా సెనెటర్ తెలియచేయడం సంచలనం కల్గించింది.

ఫాక్స్ న్యూస్ కార్యక్రయంలో తన ప్రకటన వెలువరించారు. ఈ విషయాన్ని ఆయన ప్రచార వ్యవహారాల ప్రతినిధి నాథన్ బ్రాండ్ కూడా ధృవీకరించారు. రెండునెలల తరువాత అధ్యక్ష స్థానానికి పోటీ కోసం లీడ్ ఆఫ్ కాకస్ ఆరంభం కానున్న దశలో స్కాట్ తన నిర్ణయం వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News