Monday, December 23, 2024

పాక్ నుంచి విడుదలైన 80మంది మత్స కార్మికులు

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: భారత్‌కు చెందిన 80 మంది మత్స కార్మికులు పాకిస్థాన్ జైలు నుంచి విడుదలయ్యారు. దీపావళి రోజున వారి కుటుంబాలను కలుసుకున్నారు. గుజరాత్‌కు చెందిన 80 మంది మత్సకార్మికులు మూడేళ్లుగా పాక్ జైళ్లలో ఉంటున్నారు. కరాచీ లోని జైలు నుంచి గురువారం విడుదల కాగా, మరునాడు పంజాబ్ లోని అట్టారీవాఘా సరిహద్దులో భారత్ అధికారులకు వారిని అప్పగించారు.

అనంతరం వారు రైలులో ప్రయాణించి గుజరాత్ లోని వడోదరకు ఆదివారం చేరుకున్నారు. అక్కడ నుంచి బస్సులో సొంత ఊళ్లకు వెళ్లారు. 2020 లో గుజరాత్ లోని సముద్రతీరంలో చేపల వేటకు వెళ్లిన వందలాది మత్సకారులను పాకిస్థాన్‌కు చెందిన మెరైన్ దళాలు పట్టుకున్నాయి. వీరిలో 80 మందిని ఇప్పుడు విడుదల చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News