Monday, December 23, 2024

అపార్ట్ మెంట్ లో అగ్నికీలలు.. 9 మంది బలి

- Advertisement -
- Advertisement -

మరో ఎనిమిది మందికి తీవ్రగాయాలు

21మందిని రక్షించిన సహాయక సిబ్బంది

గ్రౌండ్‌ఫ్లోర్‌లో ప్రమాదకర రసాయనాల నిల్వ

అక్కడే వాహనాలు రిపేర్, డెంటింగ్ చేస్తుండగా చెలరేగిన నిప్పురవ్వలు
హైదరాబాద్‌లోని నాంపల్లి బజార్‌ఘాట్‌లో ఘటన
ప్రమాదస్థలికి మంత్రులు కెటిఆర్, తలసాని సిఎం
కెసిఆర్ దిగ్భ్రాంతి, రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటన

మన తెలంగాణ/నాంపల్లి: నాంపల్లి బజార్‌ఘాట్ ఏరియా రెడ్‌హిల్స్‌లోని బా లాజీ నివాసం వద్ద ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం ఉద యం 9.30 గంటలకు ఓ అపార్టుమెంటు గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు ఐదు అంతస్తులకు వ్యాపించి 9మంది మృత్యువాత పడగా 8 మందికి గాయాలయ్యాయి. అపార్టుమెంట్‌లో ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి నిబంధనలను ఉల్లంఘించి ప్రమాదకర రసాయనాలు సెల్లార్‌లో నిల్వ ఉంచిన కారణంగానే పెద్ద ఎత్తున పేలుడు సంభవించినట్లు  తెలుస్తోంది. ఈ విషాదకర సంఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికుల కథనం మేరకు… సోమవారం సుమారు 9.30 గంటలకు బజార్‌ఘట్ చౌరస్థా వద్ద ఓ అపార్ట్‌మెంట్ కిందిభాగాన వాహనాలకు రిపేర్, డెంటింగ్ చేస్తుండగా అందులోంచి నిప్పురవ్వలు వ్యాపించి అక్కడే ఉన్న గోడౌన్‌లో నిల్వ ఉంచిన ప్రమాదకర కెమికల్స్ డబ్బాలకు అంటుకున్నాయి. దీంతో ఒక్కసారిగా మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. మొత్తం అపార్టుమెంటులోని నాలుగు ఫ్లోర్లకు అగ్నికీలలు కార్చిచ్చులా చెలరేగాయి. లోపల ఉంటున్న 21 మంది నల్లటి పొగ, మంటల వేడికి ఉక్కిరిబిక్కిరితో స్పృహ కోల్పోయారు. మరికొందరు బచావ్ బచావ్ అంటూ కేకలు, హాహాకారాలు, అరుపులతో ఆ అపార్టుమెంట్ దద్దరిల్లిపోయింది.

ఆకాశానికి ఎగిసిపడుతున్న మంటలను చూసి స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందగానే బల్దియా, జాతీయ విపత్తు సంస్థ, నాలుగు ఫైరింజిన్లు ఘటనా స్థలికి చేరుకుని మంటలపై నీళ్లు చల్లి అదుపుచేసేందుకు యత్నించారు. మంటల ధాటికి రసాయనాల డబ్బాలు భారీ శబ్ద్దాలతో పేలిపోయి అగ్ని కీల లు మరింత విస్తరించాయి. ఫైరింజిన్, బల్దియా, విపత్తు సిబ్బంది, పోలీసులు ప్రాణాలను లెక్కచేయకుండా నిచ్చె న ద్వారా అపార్ట్‌మెంట్ మొదటి ఫ్లార్‌లోకి ప్రవేశించారు. పలువురిని సురక్షితంగా కిందికి దించారు. అప్పటికే అపార్టుమెంట్‌లోకి వ్యాపించిన మంటలు, పొగల ధాటికి 9మంది సజీవంగా అగ్నికి ఆహుతయ్యారు. ఇదిలా ఉండగా ఈ ప్రమాదంలో చుట్టపు చూపు కోసం వచ్చిన ఓ కుటుంబం ప్రాణాలు కోల్పోయింది. అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న భవనంలో అందరూ అద్దెకే ఉంటున్నారు. ఈ ఘటనలో మృత్యువాత పడిన తాహూరా ఫరీన్ అనే గృహిణి సెలవుల నేపథ్యంలో తన ఇద్దరు పిల్లలను తీసుకొని తన బంధువుల ఇంటికి వచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఆగ్ని ప్రమాదంలో తాహూరా ఫరీన్ (35)తో పాటు ఆమె ఇద్దరు పిల్లలు తూబా (6), తరూబా (13),ఈ ఆగ్ని ప్రమదంలో చని పోయారు. దీంతో ఆ కుటుంబం తీవ్ర విషాదం నెలకొంది. మృతుల్లో ఎండి జాకీర్ హుస్సేన్ (66), ఎండి ఆజం (57), రెహ్మాన్ సుల్తానా (50), నికత్ సుల్తానా(50), తాహురా ఫర్హీన్ భర్త ఎండిముక్రం (35), హస్‌బీర్ రహమాన్ (32), ఫైజా సమీనా (26), తరూబా (13), మన్హా (06) ఉన్నారు.
నాలుగో ఫ్లోర్‌లో కుటుంబాలు విదేశాలకు
అగ్ని పమాదంలో మంటలు, పొగలు వ్యాపించడాన్ని మొదటి అంతస్థుల్లో ఉన్న పలువురు చూసి ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమై తమ ప్రాణాలను కాపాడుకునేందుకు మెట్ల ద్వారా కిందికి వచ్చేశారు. నాలుగో ఫ్లోర్‌లో ఉంటున్న కుటుంబాలు విదేశీ పవిత్ర స్థలికి వెళ్లారు. రెండు, మూడో ఫ్లోర్‌లో ఉంటున్న నివాసులు లోపలి నుంచి తలుపులు మూ సేసుకున్నారు. సిబ్బంది తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లాల్సి వచ్చింది. లోపల ఊపిరి ఆడలేక, మంటలు, పొగకు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని స్థానికులు చెబుతున్నారు. అపార్ట్‌మెంట్ యజమాని రమేశ్ జైస్వాల్ ప్రమాదం జరిగినపుడు అక్కడే ఉన్నాడు. అనుకోకుండా ఆయన కూడా లోపలికి వెళ్లి మంటలు, నల్లటి పొగ ధాటికి తట్టుకోలేక స్పృహా కోల్పోయారు. వెంటనే అతన్ని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అగ్ని ప్రమాద ఘటనను అదుపు చేసేందుకు వివిధ శాఖల ఉన్నతాకారులు దగ్గరుండి పర్యవేక్షించి లోపల ఉంటున్న వారి ప్రాణాలను కాపాడటంలోను ఎంతగానో కృషిచేశారు.
ఎన్‌డిఆర్‌ఎఫ్, జిహెచ్‌ఎంసి సిబ్బంది ఎంతో శ్రమించారు : అధికారులు
ఈ ఘటనకు సంబంధించి సమాచారం తెలియగానే సంఘటనా స్థలానికి చేరుకున్న ఎన్‌డీఆర్‌ఎఫ్, జీహెచ్‌ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు అందించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చిట్లు అధికారులు తెలిపారు. అగ్నిమాపక కార్యకలాపాలను జిల్లా అగ్నిమాపక శాఖ కె. మధుసూదనరావు పర్యవేక్షణలో జిల్లా అసిస్టెంట్ ఫైర్ అధికారి వి. ధనుంజయ రెడ్డి,తో పాటు జిహెచ్‌ఎంసి డిఆర్‌ఎఫ్ బృందాలు మొత్తం 8 ఫైర్ ఇంజన్ల ద్వారా సుమారు 6 గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపులో తీసుకువచ్చినట్లు తెలిపారు. మంటలను ఆర్పడంతో పాటు ఏకకాలంలో రెస్కు ఆపరేషన్ నిర్వహించిన 21మంది సిబ్బంది నిచ్చెనలు మెట్ల ద్వారా గాయపడిన వారితో పాటు స్పృహ కోల్పోయిన వ్యక్తులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. ఈ భవనం సీల్ట్ ఫ్లస్ తో పాటు మరో నాలుగు అంతస్తుల్లో ఉన్న ఈ భవనంలో 16 ప్లాట్‌లో ఉన్నాయని వీటిలో అందరూ అద్దెకు ఉంటున్నారని తెలిపారు. ఈ భవన యాజమానికి ప్లాస్టిక్ పరిశ్రమలు ఉండడంతో ఇందుకు అవసరమైన ముడి సరుకులు, కెమికల్స్‌ను స్టిల్ట్‌లో అక్రమంగా నిల్వ చేసినట్లు గుర్తించామని తెలిపారు. ఈ భవనానికి ఫైర్ సెఫ్టీటికి సంబంధించి ఏలాంటి జాగ్రతలు తీసుకోలేదని వెల్లడించారు.
అపార్ట్‌మెంట్‌ను సందర్శించిన మంత్రులు కెటిఆర్, శ్రీనివాస్ యాదవ్
భారీ అగ్నిప్రమాద ఘటనా స్థలిని రాష్ట్ర మంత్రులు కెటిఆర్, టి.శ్రీనివాస్ యాదవ్ సందర్శించారు. లోపల మంటల చెలరేగడానికి వెనకాల కారణాలను అధికారులను అడిగి తెల్సుకున్నారు. బాధితులకు ప్రభుత్వం తరపున రూ. 5లక్షల ఎక్స్‌గ్రేషియాను ఇస్తున్నట్లు కెటిఆర్ ప్రకటించారు. ఈ ప్రమాదానికి నిర్లక్షమా లేదా ఇతరత్రా కారణాలా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తారని, త్వరలో వాస్తవాలు వెల్లడవుతాయని, తదుపరిగా బాధ్యులపై చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మరింత మెరుగైన వైద్యం కోసం కార్పొరేట్ స్థాయిలో చికిత్సలు అందిస్తామన్నారు. అపార్ట్‌మెంట్ వద్దకు కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి విచ్చేశారు. అగ్ని ప్రమాదం జరగడానికి వెనకాల కారణాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు సహాయం గురించి తర్వాత తాను ప్రకటిస్త్తానని తెలిపారు. గ్రేటర్ బల్దియా మేయర్ విజయలక్ష్మీ సందర్శించారు. అపార్ట్‌మెంట్‌లో నివాసాల మధ్యనే గ్రౌండ్ ఫ్లోర్‌లో అక్రమంగా కెమికల్స్ డబ్బాలు నిల్వ ఉంచడాన్ని ఆమె పరిశీలించారు. ఇవి ప్రమాదకర రసాయనాలని, అక్రమంగా సాగిస్తున్న దందాపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
20 ఏళ్లుగా కెమికల్స్ డబ్బాల వ్యాపారం
అపార్ట్‌మెంట్ యజమాని రమేశ్ జైస్వాల్ గ్రౌండ్ ఫ్లోర్‌లో గత ఏళ్లుగా ప్రమాదకర రసాయనాల డబ్బాల వ్యాపారం సాగిస్తున్నాడు. దీనిలో భాగంగానే అపార్టుమెంట్ సెల్లార్‌లో 130 డ్రమ్ముల్లో కెమికల్‌ను నిల్వ ఉంచాడు. ఈ ప్రమాదంలో నిల్వ ఉంచిన 30 డ్రమ్ములకు మంటలు అంటుకుని పెద్ద ఎత్తున ప్రమాదం సంభవించింనిట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ముందుస్తుగా ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా కెమికల్స్ దందా యథేచ్ఛగా కొనసాగిస్తున్నాడని అధికారులు నిర్ధారించారు. పై ఫ్లోర్ల నిర్మా ణాలు కూడా నిబంధనలకు అతిక్రమించి అదనంగా కట్టారని బల్దియా వర్గాలు చెబుతున్నారు. ఫైబర్ కూలర్‌లో ఉపయోగించే రసాయనాల డబ్బాలను గోదాంలో ఉంచి వ్యాపారం సాగిస్తున్నాడు. అపార్టుమెంట్ యజమాని రమేశ్ జైశ్వా ల్ పరారీలో ఉండగా అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News