Monday, November 25, 2024

ఐదు గ్యారెంటీల అమల్లో కాంగ్రెస్ ఫెయిల్

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో కర్నాటక సిఎం, డిప్యూటీ సిఎం పచ్చి అబద్ధాలు ప్రచారం

కెసిఆర్ రైతుబంధును బిజెపి కాపీ కొట్టింది

కాంగ్రెస్ నయవంచనను ప్రజలు గుర్తించాలి

మీడియాతో జెడిఎస్ నేత, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి వ్యాఖ్యలు

మనతెలంగాణ/హైదరాబాద్ : కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని జెడిఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి విమర్శించారు. 5 గ్యారంటీల అమలులో కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ విఫలమయ్యిందని అన్నారు. కర్ణాటక సిఎం, డిప్యూటీ సిఎంలు తెలంగాణకు వెళ్లి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..రైతులకు కరెంట్ ఎక్కడ ఇస్తున్నారో కాంగ్రెస్ నేతలు చెప్పాలని, కర్ణాటకలో ఏ సబ్‌స్టేషన్‌కు వెళ్లి చూసినా తెలిసిపోతుందని అన్నారు. ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోందని అన్నారు. రైతులకు రూ.15 వేలు ఇస్తామని తెలంగాణలో కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఇప్పటికే ఎకరానికి రూ.10 వేలు ఇస్తున్నారని, ఇప్పటికే రూ.73 వేల కోట్లకు పైగా రైతుబంధు నిధులు రైతుల ఖాతాల్లో వేశారని చెప్పారు.

రైతుబంధు పథకాన్ని బిజెపి కాపీ కొట్టిందని విమర్శించారు. గతంలో కర్నాటకలో ఎకరానికి రూ.4 వేలు ఇచ్చేవారు అని, కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రూ.4 వేలు ఇవ్వడం లేదని తెలిపారు. కాంగ్రెస్ దగాకోరు వైఖరిని, నయవంచనను అందరూ గుర్తించాలని కోరారు. రైతులకు సిఎం కెసిఆర్ 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్నారని, కర్నాటకలో 5 గంటలు కరెంట్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని పేర్కొన్నారు. కర్నాటకలో రైతులకు ఇస్తున్నది కేవలం 2 గంటల కరెంటే అని అన్నారు. యువనిధి కింద గ్రాడ్యుయేట్స్‌కు రూ.3 వేలు, డిప్లొమా హోల్డర్లకు రూ.1,500 ఇస్తామన్నారని, యువనిధి పథకానికి ఇప్పటికీ అతీగతీ లేదని విమర్శించారు. ఇప్పుడేమో 2023 -24లో పాసైన వారికే అని మాట మార్చారని చెప్పారు.

కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలన్నీ గారడీలే అని, కాంగ్రెస్ దగాకోరు వైఖరిని, నయవంచనను ప్రజలందరూ గుర్తించాలని కోరారు. రాజస్థాన్‌లో రైతు రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇస్తున్నారని, కర్నాటక రైతు రుణాలు ఎందుకు మాఫీ చేయరో చెప్పాలని అడిగారు. కర్నాటక రైతులు రూ.33,700 కోట్లు నష్టపోయారని, కర్నాటక రైతులను కాంగ్రెస్ సర్కార్ ఎందుకు ఆదుకోవడం లేదు..? అని కుమారస్వామి ప్రశ్నించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News