Monday, December 23, 2024

ఒకే ఓవర్‌లో ఆరు వికెట్లు….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఒకే ఓవర్‌లో ఆరు వికెట్లు తీసిన ఘనత ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ ప్రీమియర్ లీగ్ డివిజన్ మ్యాచ్‌లో జరిగింది. ఒక ఓవర్‌లో ఐదు పరుగులు చేస్తే విజయం సాధిస్తారు కానీ ఆరు వికెట్లు కోల్పోవడంతో ఓటమిని చవిచూశారు. సర్ఫర్స్ ప్యారడైజ్- ముద్గీరాబా నెరంగ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ముద్గీరాబా జట్టు బ్యాటింగ్ చేసి 40 ఓవర్లలో 178 పరుగులు చేసింది. దీంతో 179 పరుగుల లక్షంతో సర్ఫర్స్ ప్యారడైజ్ జట్టు బరిలోకి దిగింది. సర్ఫర్స్ జట్టు 39 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 174 పరుగులు సాధించింది. చివర ఓవర్లలో ఐదు పరుగులు చేస్తే విజయం సాధిస్తుంది. ముద్గీరాబా జట్టు కెప్టెన్ గారెత్ మోర్గాన్ బంతి తీసుకొని బౌలింగ్ చేశాడు. తొలుత నాలుగు బంతుల్లో నలుగురు క్యాచ్ ఔట్ కాగా మరో ఇద్దరు క్లీన్ బౌల్డ్ కావడంతో ముద్గీరాబా జట్టు ఘన విజయం సాధించింది. కెప్టెన్ గారెత్ ఏడు ఓవర్లు వేసి ఏడు వికెట్లు తీసి 16 పరుగులు ఇచ్చాడు. గారెత్ బ్యాటింగ్ చేసి 39 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. 2011లో న్యూజిలాండ్‌లో వెల్లింగ్టన్‌పై ఓటాగో చెందిన నీల్ వాగ్నర్ ఐదు వికెట్లు తీశాడు. 2013లో బంగ్లాదేశ్‌లో యుసిబి-బిసి జట్టు చెందిన ఆల్ అమీన్ హోస్సేన్ అనే బౌలర్ అభానీ లిమిటెడ్ జట్టుపై ఐదు వికెట్లు తీశాడు. 2019లో భారత్‌లో కర్నాటక రాష్ట్రానికి చెందిన అభిమన్యు మిథున్ హర్యానాపై ఐదు వికెట్లు తీశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News