Friday, December 20, 2024

ప్రేమించాడు…. పెళ్లి చేసుకున్నాడు…. చంపేశాడు…

- Advertisement -
- Advertisement -

మేడ్చల్: ప్రేమించాడు… పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు మధ్య ఆర్థిక ఇబ్బందులతో గొడవలు జరగడంతో భార్యను భర్త చంపేసిన సంఘటన మేడ్చల్ జిల్లా నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. వరంగల్ జిల్లాకు చెందిన స్రవంతి, సిద్దిపేట జిల్లాకు మహేందర్ 2019లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు మూడేళ్ల కుమార్తె కూడా ఉంది. ఉప్పల్‌లో నివిసిస్తుండగా మహేందర్ ఓ కేసులో జైలు కెళ్లడంతో ఆమె డబ్బులు ఖర్చు చేసి అతడిని బయటకు తీసుకొచ్చింది. డబ్బుల విషయంలో ఇద్దరు మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. కానీ ఉప్పల్ నుంచి నేరేడ్ మెట్ కు మకాం మార్చారు. భర్తతో గొడవలు జరగడంతో ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యకు భర్త ఫోన్ చేసి ఇల్లు ఖాళీ చేస్తున్నానని చెప్పడంతో ఆమె తన అద్దె ఇంటికి వచ్చింది.

భార్య వస్తువులను భర్త తీసుకెళ్లడంతో అతడిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఇద్దరు మధ్య ఘర్షణ తారా స్థాయికి చేరుకోవడంతో భార్య ముఖంపై భర్త పిడుగుద్దులు కురుపించాడు. ఆమె అపస్మారక స్థితిలో పోవడంతో మెడకు చున్నీ కట్టి మంచం కింద పడేసి అక్కడి నుంచి మహేందర్ వెళ్లిపోయాడు. తన చెల్లి రాకపోవడంతో ఆమె అన్నయ్య ప్రశాంత్ అక్కడికి చేరుకొని ఇంటి డోర్ తీశాడు. చెల్లి మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు మహేందర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News