- Advertisement -
కాదేది ప్రచారానికి అనర్హం
మద్యం ప్రియులను ఆకట్టుకునేందుకు వివిధ పార్టీల అభ్యర్థులు వినూత్న రీతిలో ప్రచారం సాగిస్తున్నారు. నల్గొండ జిల్లాలోని నకిరేకల్(ఎస్‌సి) నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేముల వీరేశం ఫోటోతో ఉన్న బీరు బాటిల్స్ వైన్ షాపులలో దర్శనమిస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థికే ఓటు వేయాలన్న అభ్యర్థనతో అంటించిన స్టిక్కర్లు బీరు బాటిల్స్‌పై కనిపించడంతో మందుబాబులు సైతం ఆశ్చర్యపోతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ఎవరైనా ఈ రకరంగా ప్రచారం చేస్తున్నారా అన్న విషయం తెలియరాలేదు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
- Advertisement -