Saturday, December 21, 2024

కాంగ్రెస్ వస్తే కైలాసం ఆటలో పెద్దపాము మింగినట్లు అయితది: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

పాలకుర్తి: రైతులు ఎవరైనా పది హెచ్‌పి మోటర్లు వాడతారా?, పది హెచ్‌పి మోటర్లను కాంగ్రెసోళ్లు ఇస్తారా? అని సిఎం కెసిఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ వస్తే రైతుబంధు మాయం అయితదని, కెసిఆర్ 24 గంటల కరెంటు ఇచ్చి దుబారా చేస్తున్నాడని అంటున్నారని, 24 గంటల కరెంట్ కావాలా? వద్దా? అని ప్రజలే తేల్చుకోవాలన్నారు. పాలకుర్తిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కెసిఆర్ ప్రసంగించారు. కాంగ్రెసోళ్లు ధరిణిని బంగాళాఖాతంలో పడేస్తారంట అని, మీ భూమిపై హక్కు మీ బొటన వేలుకు కల్పించామన్నారు. ధరణి తీసేస్తే రైతుబంధు, రైతు బీమా ఎలా వస్తదని అని నిలదీశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కైలాసం ఆటలో పెద్దపాము మింగినట్లు అయితదని, మళీ దళారుల రాజ్యం కావాలా? అని కెసిఆర్ అడిగారు. రైతులు బలపడాలని నిర్ణయాలు తీసుకున్నామని, తెలంగాణలో నీళ్లకు, కరెంట్‌కు ట్యాక్స్ లేదని, ఆలోచించి ఓటేస్తే మీ హక్కులు మీకే ఉంటాయని, కాంగ్రెస్ మోసపు మాటలపై చర్చ పెట్టాలని, ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం ప్రజల కండ్ల ముందే ఉందని కెసిఆర్ చెప్పారు. పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News