రణ్‌బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఎంటర్ టైనర్ ‘యానిమల్’. ఇప్పటికే విడుదలైన టీజర్ తోపాటు పాటలు నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతూ ప్రశంసలు అందుకున్నాయి. తాజాగా మేకర్స్ ఈ యానిమల్ నుంచి ‘నాన్న నువ్ నా ప్రాణం’ అనే పాటను విడుదల చేశారు. రణ్‌బీర్, అనిల్ కపూర్ ల మధ్య చిత్రీకరించిన ఎమోషనల్ బాండింగ్ నేపథ్యంలో ఈ పాటను చిత్రీకరించారు. ట్యాలెంటెడ్ సింగర్ సోనూ నిగమ్ మెస్మరైజింగ్ గా ఆలపించిన ఈ పాట.. రణబీర్, అనిల్ కపూర్ పాత్రల కాంప్లెక్స్ లేయర్స్ ని ప్రజెంట్ చేస్తూ త్రండీ కొడుకుల బంధాన్ని అందంగా చిత్రీకరిస్తుంది.
భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ టి సిరీస్, మురాద్ ఖేతాని సినీ1 స్టూడియోస్, ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ పై ‘యానిమల్’ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. ఇందులో రణబీర్ సరసన నేషనల్ క్రష్ రష్మికా మందనా హీరోయిన్ గా నటిస్తోంది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచుసున్న ఈ క్రైమ్ డ్రామా డిసెంబర్ 1, 2023న గ్రాండ్ గా విడుదల కానుంది.