Monday, December 23, 2024

ఇక్కడ నేను గెలిస్తే.. అక్కడ బాబు గెలిచినట్టే!

- Advertisement -
- Advertisement -

ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రత్యర్థి పార్టీల నేతలు కూడా ఆయన వ్యాఖ్యలలోని అంతరార్థంపై చర్చించుకోవడం మొదలెట్టారు.అసలు సంగతి ఏమిటంటే.. ఖమ్మంలో తుమ్మల తెలుగు తమ్ముళ్ల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలుగుదేశం పార్టీ అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

తుమ్మల మాట్లాడుతూ తన విజయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైన మలుపు అవుతుందన్నారు. ఇక్కడ తను గెలిస్తే, ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ చంద్రబాబు అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ మీటింగ్ కు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పలువురు టీడీపీ అభిమానులు కూడా హాజరయ్యారు. వారిని ఉద్దేశించి తుమ్మల మాట్లాడుతూ తెలుగు తమ్ముళ్ల కష్టం ఉంచుకోనని, పచ్చ కండువాకు తాను ఎంతో రుణపడి ఉన్నానని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News