Monday, December 23, 2024

కర్ణాటక నియామక పరీక్షల్లో అభ్యర్థుల డ్రెస్‌కోడ్‌లో కీలక మార్పులు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : నియామక పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ (కెఇఎ) డ్రెస్ కోడ్ విధించింది. తల, ముఖం, చెవులు, నోటిని పూర్తిగా కప్పేలా టోపీలు లేదా దుస్తులు ధరించిన వారిని పరీక్ష కేంద్రం లోకి అనుమతించబోమని స్పష్టం చేసింది. పరీక్షల్లో మోసాలు, కాపీయింగ్‌ను నివారించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ఈమేరకు డ్రెస్‌కోడ్ కు సంబంధించి తాజాగా ప్రకటన విడుదల చేసింది. దీంతోపాటు లోహపు ఆభరణాలను కూడా అనుమతించబోమని తెలిపింది.

అయితే పెళ్లయిన మహిళలు మంగళసూత్రం, మెట్టెలు ధరించి పరీక్ష రాసేందుకు అనుమతిస్తున్నట్టు తెలిపింది. గతంలో వీటిపైనా కేఈఏ నిషేధం విధించగా, కొన్ని సంఘాల నుంచి వ్యతిరేకత ఎదురైంది. దీంతో తాజా ఉత్తర్వుల్లో ఆ నిబంధనను సడలించారు. నవంబరు 18,19 తేదీల్లో రాష్ట్రంలో పలు బోర్డులు, కార్పొరేషన్ల ప్రవేశ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఈ డ్రెస్‌కోడ్‌ను ప్రకటించారు.

కాగా, కర్ణాటకలో హిజాబ్‌పై పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో తాజాగా డ్రెస్‌కోడ్ మరోసారి రాష్ట్రంలో చర్చకు తెరలేపింది. తాజా నిబంధనల్లో హిజాబ్‌ను నేరుగా ప్రస్తావించనప్పటికీ, తలను కప్పి ఉంచే దుస్తులపై నిషేధం ఉండటంతో దీన్ని ధరించేందుకు కూడా అనుమతి ఉండబోదని తెలుస్తోంది. ఇదిలా ఉండగా అక్టోబర్‌లో జరిగిన కొన్ని నియామక పరీక్షల్లో హిజాబ్‌ను అధికారులు అనుమతించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News