Monday, December 23, 2024

కుమారస్వామిపై విద్యుత్ అక్రమ వినియోగం ఆరోపణలు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి దీపావళి సందర్భంగా తన నివాసాన్ని అలంకార దీపాలతో వెలిగించేందుకు. అక్రమంగా విద్యుత్‌ను లాక్కున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఎక్స్ వేదికపై ఒక వీడియోని కూడా షేర్ చేసింది. ప్రపంచంలోనే అత్యంత నిజాయితీపరుడైన కుమారస్వామికి చెందిన నివాసం.. విద్యుత్ స్తంభం నుండి నేరుగా అక్రమ విద్యుత్ కనెక్షన్‌తో అలంకార దీపాలతో వెలిగిపోయింది. ఒక మాజీ ముఖ్యమంత్రి విద్యుత్‌ని దొంగలించేంత పేదరికంలో మగ్గిపోతుండడం నిజందా దురదృష్టకరం అని కాంగ్రెస్ ఆయనపై విరుచుకుపడింది.

కుమారస్వామిని మరింత విమర్శిస్తూ.. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం గృహ జ్యోతి పథకం కింద రెసిడెన్షియల్ కనెక్షన్‌ల కోసం నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును అందిస్తోందని, 2,000 యూనిట్లు కాదని తెలిపింది. మీరు నిజంగా అంత పేదరికంలో ఉంటే, మీరు గృహజ్యోతి పథకానికి దరఖాస్తు చేసి ఉండాల్సింది. గృహజ్యోతి కింద ఒక విద్యుత్ మీటర్ మాత్రమే అనుమతించబడుతుందని మీకు తెలియదు కదా! మీ పేరుపై చాలా మీటర్లు ఉన్నాయి అంటూ కుమారస్వామిపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News