Sunday, January 19, 2025

బాబర్ ఆజమ్‌పై వేటు?

- Advertisement -
- Advertisement -

కరాచీ: ప్రపంచకప్‌లో పాకిస్థాన్ ఘోర వైఫల్యం నేపథ్యంలో కెప్టెన్ బాబర్ ఆజమ్‌పై వేటు వేయాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) భావిస్తున్నట్టు తెలిసింది. పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి బాబర్‌ను తప్పించేందుకు పిసిబి ప్రణాళికలు రచిస్తున్నట్టు పాక్ మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. భారత్ గడ్డపై జరుగుతున్న వరల్డ్‌కప్‌లో బాబర్ సారథ్యంలోని పాకిస్థాన్ పేలవమైన ప్రదర్శనతో లీగ్ దశలోనే ఇంటిదారి పట్టిన విషయం తెలిసిందే.

జట్టు చెత్త ప్రదర్శనపై పిసిబి అధికారులు ఆగ్రహంతో ఉన్నారు. బాబర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించాలనే నిర్ణయానికి బోర్డు అధికారులు వచ్చినట్టు సమాచారం. అంతేగాక జట్టుకు సేవలు అందిస్తున్న విదేశీ కోచింగ్ స్టాఫ్ మొత్తాన్ని కూడా తొలగిస్తున్నట్టు తెలిసింది. టీమ్ డైరెక్టర్ మిక్కీ ఆర్థర్‌ను కూడా తప్పిస్తున్నట్టు పిసిబి వర్గాలు వెల్లడించారు. ఇప్పటికే పాక్ బౌలింగ్ కోచ్ పదవికి మోర్నీ మోర్కెల్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News