ముంబై: భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు దశకు చేరుకున్న విషయం తెలిసిందే. బుధవారం ముంబైలో జరిగే తొలి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌తో ఆతిథ్య టీమిండియా తలపడుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌పై దేశ వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారత జట్టు గెలవాలని కోరుతూ దేశ వ్యాప్తంగా ప్రార్థనాలు జరుగుతున్నాయి.
కిందటిసారి వరల్డ్‌కప్ సెమీస్‌లో కివీస్ చేతిలో ఓటమి పాలైన భారత్ ఈసారి ప్రతీకారం తీర్చుకోవాలని కోట్లాది మంది అభిమానులు కోరుతున్నారు. ఇక కివీస్‌టీమిండియా మ్యాచ్‌ను తిలకించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. లీగ్ దశలో భారత్ ఆడిన తొమ్మిది మ్యాచుల్లోనూ గెలిచి అజేయంగా నిలిచింది. సెమీస్‌లోనూ కివీస్‌ను మట్టికరిపించాలని అభిమానులు కోరుకుంటున్నారు. సెమీస్ మ్యాచ్ నేపథ్యంలో దేశంలో క్రికెట్ సందడి నెలకొంది. ఎక్కడ చూసినా క్రికెట్ గురించే చర్చ జరుగుతోంది.