Monday, December 23, 2024

హైదరాబాద్ హౌసింగ్ రిజిస్ట్రేషన్ 25 శాతం వృద్ధి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : అక్టోబర్ 2023లో హైదరాబాద్ లో దాదాపు 5,787 నివాస ఆస్తు ల రిజిస్టర్ జరగ్గా, ఇది వార్షికం గా 25 శాతం వృద్ధిని నమోదు చేసిందని నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక తెలిపింది. ఈ నమోదైన ఆస్తుల మొత్తం విలువ రూ.3,170 కోట్లు , ఇది కూడా వార్షికంగా 41 శాతం పెరిగింది. విక్రయాల ను చూస్తే అధిక ధ ర నివాసాల విక్రయం వైపు మళ్లినట్లు కనిపిస్తోంది. హైదరాబాద్ నివాస మార్కెట్ హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి వంటి నాలుగు జిల్లాలుగా విభజించారు.

అక్టోబర్ 2023లో హైదరాబాద్‌లో అత్యధిక శాతం ఆస్తి రిజిస్ట్రేషన్‌లు రూ. 25 -నుంచి రూ.50 లక్షల ధర పరిధిలో ఉన్నాయి, వీటి వాటా మొత్తం రిజిస్ట్రేషన్‌లలో 50 శాతం ఉం ది. రూ.25 లక్షల కంటే తక్కు వ విలువైన ఆస్తి మొ త్తం రిజిస్ట్రేషన్‌లో 16 శాతం ఉంది. నై ట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజాల్ మాట్లాడుతూ, హైదరాబాద్ హౌసింగ్ మార్కెట్ డి మాండ్‌లో గణనీయమైన పెరుగుదలను చూస్తోందన్నారు.

ఏప్రిల్ 2023 నుండి వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బిఐ) నిర్ణయం గృహ కొనుగోలుదారుల విశ్వాసాన్ని గణనీయంగా పెంచింది. అ క్టోబర్ 2023లో నమోదిత గృహాలు 1,000-2,000 చ.అడుగుల విస్తీర్ణంలో క్లస్టర్ చేయ గా, రిజిస్ట్రేషన్లలో 69 శాతం ఉన్నాయి. చిన్న ఇళ్లు (500 -1,000 చ.అ.) డిమాండ్ తగ్గింది, అక్టోబర్ 2022 లో రిజిస్ట్రేషన్లు 21 శాతం నుండి 2023 అక్టోబర్‌లో 16 శాతానికి తగ్గాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News