Monday, December 23, 2024

పోలింగ్ బూత్‌ల వద్ద మజ్లిస్ అగడాలను కట్టడి చేయాలి: రాజాసింగ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః గోషామహల్ నియోజకవర్గం పోలింగ్ స్టేషన్లలో రిగ్గింగ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఈవోను గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్ధి రాజాసింగ్ కోరారు. సోమవారం ఆయన నియోజకవర్గంలో గతంలో భారీ మొత్తంలో రిగ్గింగ్ జరిగిందని ఆసారి అలా జరగకుండా చర్యలు తీసుకోవాలని వినతి పత్రం ఇచ్చారు. ఈసందర్భంగా మాట్లాడుతూ మంగళహాట్, దత్తాత్రేయ నగర్, బేగంబజార్ ప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద సీసీటీవీ, పోలీస్, సెంట్రల్ ఫోర్సెస్ సిబ్బందితో పాటు మహిళ కానిస్టేబుల్ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు.

2018లో ఒక వర్గానికి చెందిన మహిళ ముఖానికి మాస్కులు ధరించి 5 నుంచి 10 దొంగ ఓట్లు వేశారని అందుకోసం ఓటు వేసే ప్రతి మహిళను తనిఖీ చేసిన తరువాత ఓటు వేసేలా చూడాలన్నారు. మజ్లిస్ పార్టీకి స్దానిక నాయకులు పోలీసుల అండదండలతో పోలింగ్ స్టేషన్ల వద్ద నిబంధనలు ఉల్లంఘిస్తూ సమీపంలో గుంపులుగా నిలబడి డబ్బులు విచ్చిల విడిగా పంచుతారని బూత్ వద్ద ఎన్నికల నిబంధనలు పాటించేలా చూడాలన్నారు. ఉంచాలని కోరాం కొంతమంది పోలీస్ అధికారులు బీజేపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారు. పోలింగ్ టైంలో బూత్ లోకి ఎవరు వచ్చినా ఐడీ కార్డ్ చూపించేలా చర్యలు తీసుకోవాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News