- Advertisement -
హైదరాబాద్: : కర్ణాటక బిజెపి అధ్యక్షునిగా నియామకమైన మాజీ సిఎం యెడియూరప్ప కుమారుడు బివై విజయేంద్ర బుధవారం బాధ్యతలను స్వీకరించారు. మాజీ ముఖ్యమంత్రులు బిఎస్ యెడియూరప్ప, బసవరాజ్ బొమ్మై, డివి సదానందగౌడ, పార్టీ సీనియర్ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మొదటిసారి ఎమ్‌ఎల్‌ఎ అయిన 47 ఏళ్ల విజయేంద్ర నవంబర్ 10న రాష్ట్ర బిజెపి అధ్యక్షునిగా నియామకమయ్యారు. అంతకు ముందు ఆయన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. విజయేంద్రకు ముందు రాష్ట్ర బిజెపి అధ్యక్షునిగా నలిన్‌కుమార్ కటీల్ మూడేళ్ల పాటు పనిచేశారు.
- Advertisement -