Sunday, November 24, 2024

ఆ రూ.25,000 కోట్లు ఎలా మాయమయ్యాయి?

- Advertisement -
- Advertisement -

సహారా ఇన్వెస్టర్లకు రూ.25,000 కోట్ల చెల్లింపులు ఎలా?

సుబ్రతా రాయ్ మృతితో చర్చనీయాంశంగా 3 కోట్ల మంది ఇన్వెస్టర్ల సొమ్ము
సెబీ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది?

న్యూఢిల్లీ : సహారా గ్రూప్ వ్యవస్థాపకుడు సుబ్రతా రాయ్ మృతితో ఆయన కంపెనీ ఇన్వెస్టర్లకు చెల్లించాల్సిన రూ. 25,000 కోట్ల పరిస్థితి ఏమిటి? అనేది చర్చనీయాంశంగా మారింది. రాయ్ మరణానంతరం ఇన్వెస్టర్ల మదిలో తమ డ బ్బుకు సంబంధించి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వారు కష్టపడి పెట్టుబడి పెట్టిన డబ్బు తిరిగి వస్తుందా? డబ్బు పో యే అవకాశం ఉందా? సహారా గ్రూపునకు చెందిన నాలు గు సహకార సంస్థల్లో దేశవ్యాప్తంగా కోట్లాది మంది పెట్టుబడులు పెట్టారు. దీనిలో చాలా తక్కువ ఆదాయం ఉన్న సా మాన్య ప్రజల సొమ్ము కూడా ఉంది. కొన్ని ఇటీవల పరిణామాల తర్వాత పెట్టుబడిదారులు తమ డబ్బును తిరిగి పొం దవచ్చని భావించారు. అయితే ఇప్పుడు సుబ్రతా రాయ్ మ రణానంతరం ఈ విషయంపై ప్రజల్లో ఆందోళన మొదలైంది. సహారా గ్రూప్ వల్ల మోసపోయిన పెట్టుబడిదారుల కు వడ్డీతో సహా చెల్లించాలంటూ గతంలో స్టాక్ మార్కెట్ రె గ్యులేటర్ సెబీచర్యలు దీనిలో స్వల్పంగా చెల్లించినప్పటికి పూర్తి స్థాయిలో అమలు కాలేదు.

వివాదంలో సహారా

సహారా గ్రూప్ కంపెనీల నిబంధనల ఉల్లంఘనలతో సుబ్ర తా రాయ్ అనేక నియంత్రణ, న్యాయపరమైన పోరాటాలను ఎదుర్కోవలసి వచ్చింది. పోంజీ పథకం నిబంధనలను ఉల్లంఘించిందని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను రాయ్ వర్గం ఎప్పుడూ కొట్టిపారేస్తూ వచ్చింది. 2011లో మార్కెట్ రెగ్యులేటర్ సెబీ రెండు సహారా గ్రూప్ కంపెనీలైన సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎస్‌ఐఆర్‌ఇఎల్), సహారా హౌసింగ్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎస్‌హెచ్‌ఐసిఎల్) చర్యలు తీసుకుంది. ఈ రెండు కంపెనీ బాండ్ల పేరిట దాదాపు 3 కోట్ల మంది ఇన్వెస్టర్ల నుంచి నిధులను సేకరించగా, ఈ డబ్బును తిరిగి వారికి ఇవ్వాలని సెబీ ఆదేశించింది. రెండు కంపెనీలు తమ నిబంధనలను ఉల్లంఘించి నిధులు సేకరించాయని సెబీ ఉత్తర్వుల్లో పేర్కొంది. సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత 2012లో సుప్రీంకోర్టు సెబీ ఆదేశాలను సమర్థించింది. పెట్టుబడిదారుల నుంచి సేకరించిన నిధులను 15 శాతం వడ్డీతో తిరిగి ఇవ్వాలని రెండు కంపెనీలను కోరింది.

11 ఏళ్లలో చెల్లించింది ఎంత?

పెట్టుబడిదారులకు డబ్బును తిరిగి ఇవ్వడానికి సు మారు రూ.24,000 కోట్లను సెబీ వద్ద డిపాజిట్ చేయాలని సహారా గ్రూప్‌కు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. అయి తే ఇప్పటికే 95 శాతానికి పైగా ఇన్వెస్టర్లకు నేరుగా చెల్లించామని సహారా గ్రూప్ చాలా కాలంగా చెబుతోంది. 11 సంవత్సరాలలో సెబీ రెం డు సహారా గ్రూప్ కంపెనీల పెట్టుబడిదారులకు రూ. 138.07 కోట్లు తిరిగి చెల్లించారు. ఇదిలా ఉండగా రీ-పేమెంట్ కోసం ప్రత్యేకంగా ఓపెన్ చేసిన బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన మొత్తం రూ.25,000 కోట్లు దాటింది.అయితే సెబీ -సహారా రిఫండ్ ఖాతా లో బకాయి మొత్తం రూ.1087 కోట్లు పెరిగింది. చివరి అప్‌డేట్‌లో సెబీ 2022 మార్చి 31 వరకు 17,526 అప్లికేషన్‌లకు సంబంధించిన మొత్తం రూ. 138 కో ట్లు చెల్లించింది. 2023 మార్చి 31 నాటికి జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన మొత్తం రూ. 25,163 కోట్లు అని సెబీ తెలిపింది. దరఖాస్తు చేసుకున్న వారికి ఆన్‌లైన్ ద్వారా చెల్లింపులు చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News