Friday, December 20, 2024

వరల్డ్ కప్‌లో అత్యధిక సిక్స్‌ల రికార్డు రోహిత్ ఖాతాలో

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వరల్డ్ కప్ మ్యాచ్‌లలో రోహిత్ శర్మ 51 సిక్స్‌లు కొట్టి రికార్డు సృష్టించాడు. రోహిత్ 27 మ్యాచ్‌ల్లో 51 సిక్స్‌లు బాదాగా క్రిష్ గేల్ 35 మ్యాచ్‌ల్లో 49 సిక్స్‌లు బాది సెకండ్ స్థానంలో ఉన్నారు. గ్లెన్ మ్యాచ్‌లో 25 మ్యాచ్‌ల్లో 43 సిక్స్‌లతో మూడో స్థానంలో ఉన్నాడు. 2023 వరల్డ్ కప్‌లో రోహిత్ 28 సిక్స్‌లు రికార్డు సృష్టించాడు. క్రిష్ గేల్ 2015 వరల్డ్ కప్‌లో 26 సిక్స్‌లతో రెండో స్థానంలో ఉన్నాడు. టెస్టు, వన్డే, టి-20 మూడు ఫార్మాట్లలో కలిపి రోహిత్ శర్మ 579 సిక్స్‌లతో తొలి స్థానంలో ఉండగా క్రిష్ గేల్ 553 సిక్స్‌లతో రెండో స్థానంలో ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ 44 మ్యాచ్‌ల్లో 241 ఫోర్లతో తొలి స్థానంలో ఉండగా కుమార్ సంగాక్కర 147 పోర్లతో రెండో స్థానంలో ఉన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News